//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మొదటి రోజే రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో రైలు !

Category : national

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మెట్రోరైలు తొలిరోజే రికార్డు సృస్టించింది.

అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ వీరు లక్ష అనుకుంటే అలా కాకుండా తొలిరోజు ఏకంగా 2లక్షలకు మించి ప్రజలు మెట్రోలో ప్రయాణించారు. దేశంలో ఇప్పటివరకు వివిధ నగరాల్లో ప్రారంభమైన మెట్రోలో తొలిరోజు 50వేలకు మించి ప్రజలు ప్రయాణించలేదు. హైదరాబాద్‌ మెట్రోలో మాత్రం 2లక్షలకు పైగా ప్రయాణించడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ఏ నగరంలో లేనట్లుగా ఏకంగా 30 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి తీసుకురావడం, అంతర్జాతీయ ప్రమాణాలు, విమానాశ్రయాలను తలపించేలా మెట్రోస్టేషన్లను తీర్చిదిద్దడంతో ప్రజలు మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు.