//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

15 మందిని చంపిన ఏనుగు కోసం హైదరాబాద్‌ పోటుగాడి వేట

Category : national

గ్రామల మీదపడి జనాన్ని చంపేస్తోన్న మదపుటేనుగు ఆట కట్టించేందుకు హైదరాబాద్‌కు చెందిన టాప్‌ హంటర్‌ నవాబ్‌ షఫత్‌ అలీ ఖాన్‌ మళ్లీ తుపాకి పట్టారు. గడిచిన కొద్ది రోజులుగా జార్ఖండ్‌, బిహార్‌లలో 15 మంది ఆదివాసీలను పొట్టనపెట్టుకున్న భారీ ఎనుగును మట్టుపెట్టేందుకు ఆయన షహీబ్‌గంజ్‌ అడవుల్లో ఆపరేషన్‌ ప్రారంభించారు.

 ఆపరేషన్‌ ఉత్కంఠభరితంగా సాగుతున్నదని, నేడో, రేపో ఆ మహమ్మారి చనిపోయిందనే వార్త రావొచ్చని జార్ఖండ్‌ అటవీశాఖ ముఖ్య అధికారి ఎల్‌ఆర్‌ సింగ్‌ తెలిపారు. జార్ఖండ్‌-బిహార్‌ సరిహద్దులోని షహీబ్‌గంజ్‌ అభయారణ్యంలో మంద నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు గ్రామాలపై దాడిచేస్తూ ఇప్పటివరకు 15 మందిని పొట్టనపెట్టుకుంది.

ఈ అభయారణ్యంలో పహారియా తెగకు చెందిన ఆదివాసీలు జీవిస్తున్నారు. ఏనుగు దాడిలో చనిపోయిన 15 మందిలో 9మంది పహారియా తెగకు చెందినవారే కావడం గమనార్హం. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అటవీశాఖ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో చివరికి ఏనుగును చంపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఎల్‌ఆర్‌సింగ్‌ తెలిపారు.