//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హైదరాబాద్ లో సిలిండర్ల పేలుడు.. రోడ్ మీద వెళుతోన్న వారికి అంటుకున్న మంటలు.. మృతి

Category : state

హైదరాబాద్ సిటీ శివార్ల భారీ పేలుడు జరిగింది. ఈరోజు మధ్యాహ్నం మేడిపల్లి సమీపంలోని చంగిచర్ల దగ్గర ట్యాంకర్ కు మంటలు అంటుకుంటున్నాయి.

పెద్ద శబ్ధంతో ట్యాంకర్ పేలిపోయింది. ఆయిల్ ఎగసిపడింది. ఆయిల్ తోపాటు మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. రోడ్డుపై వెళుతున్న వాహనదారులపై కూడా ఆయిల్ పడింది. వాహనాలు తగలబడిపోయాయి. ఐదు బైక్స్ నడిరోడ్డుపై తగలబడిపోయాయి.

ముగ్గురి వ్యక్తులకు శరీరం అంతా కాలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి 5 ఫైరింజన్లు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి.

పరిసర ప్రాంతంలో అర కిలోమీటర్ దూరం వరకు దట్టమైన పొగలు అలుముకున్నాయి. భారీ పేలుడుకి స్థానికులు వణికిపోయారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. ఆయిల్ ట్యాంకర్ పేలుడు అని తెలిసిన తర్వాత.. చుట్టు పక్కల ఇళ్లల్లోని జనం ఖాళీ చేశారు. పేలుడుకి పక్కనే ఉన్న అపార్టుమెంట్ లో ప్రమాదం జరిగిన సమయానికి ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.