//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సైక్లింగ్ రేసులో హైదరాబాద్ డీఎస్పీ అరుదైన రికార్డు

Category : sports

ప్రతిష్ఠాత్మక లండన్-ఎడిన్‌బర్గ్-లండన్ -2017 సైక్లింగ్ రేసును హైదరాబాద్ పోలీస్ విభాగానికి చెందిన డీఎస్పీ సదానంద రెడ్డి పూర్తి చేసి అరుదైన రికార్డును అందుకున్నాడు. 52 ఏండ్ల వయసులో 1436 కిలోమీటర్ల రేసును పూర్తి చేసి తెలంగాణ పోలీస్ సత్తా చాటాడంటూ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఎంతో కఠినమైన ఈ రేస్‌ను కేవలం ఐదురోజుల్లోనే పూర్తి చేసిన డీఎస్పీ సదానందరెడ్డి అదరహో అనిపించారు.

ఈ రేసును బ్రిటన్‌లోని అడాక్స్ యూకే సంస్థ ప్రతి ఏడాది నిర్వహిస్తుంది. ఇది ఎలాంటి పోటీ కాదు. కేవలం పర్యావరణం, ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రేసును నిర్వహిస్తున్నారు. 1436 కిలోమీటర్ల మార్గంలో ఎక్కువగా కొండలు, గుట్టలతో ఎంతో కష్టమైన మార్గంలో సైక్లిస్టులు కేవలం ఐదురోజుల్లో లండన్ నుంచి ఎడిన్‌బర్గ్ చేరి మళ్లీ లండన్ తిరిగి రావాల్సి ఉంటుంది.

ఏడాది గత నెల 30 నుంచి ఆగస్టు 4 వరకు ఈ రేస్ కొనసాగగా హైదరాబాద్ నుంచి ఏడుగురు సభ్యులు ఈ రేసులో పాల్గొనగా అందులో 5గురు రేసును పూర్తి చేశారు. సైక్లింగ్ పట్ల రాష్ట్రవాసులకు ముఖ్యంగా భాగ్యనగర వాసులకు అవగాహన కల్పించే లక్ష్యంతో సొంత ఖర్చులతో ఈ రేసులో పాల్గొన్నానని డీఎస్పీ తెలిపారు.

"నేను ఇంటిలిజెన్స్ సెక్యూరిటీవింగ్‌లో డీఎస్పీగా పనిచేస్తున్నాను. 2016లో హైదరాబాద్ రాండిసన్స్ సైక్లింగ్‌క్లబ్‌లో చేరాను. ఏకబిగిన 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించడంలో మెళకువలు నేర్చుకున్నా. తర్వాత నా దృష్టి ప్రపంచ స్థాయిలో పెద్దదైన లండన్-ఎడిన్‌బర్గ్-లండన్-2017 ఛాలెంజ్‌పై పడింది. సొంత ఖర్చులతోనే సైక్లింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లా. కేవలం పాలు, నీళ్లతోనే నా ప్రయాణం కొనసాగించా" అని సదానంద తెలిపారు.

Related News