//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

# బాయ్‌ఫ్రెండ్‌తో రాశ‌లీలలు.. అడ్డుగా ఉన్నాడని భర్త‌ను లేపేసిన భార్య‌..!

Category : state

తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి అక్రమ సంభంధాల వల్ల ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతుంది. అక్రమ సంభంధం వల్ల ఎన్నో దారుణాలు జరుగుతూనే వున్నాయి. మొన్న జరిగిన మహబూబ్‌న‌గ‌ర్ స్వాతి ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే, మళ్ళీ ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది.అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నదని తనభర్తను దారుణంగా ప్రియుడితో హత్య చేయించింది ఒక భార్య.

పూర్తీ వివరాలలోకి వెళితే హైదరాబాద్ బోరబండలో వుండే 46 ఏళ్ల మహ్మద్ ఖాజాకు 26 ఏళ్ల సలేహా బేగంతో రెండో వివాహం కొన్ని రోజుల కిందట జరిగింది. అయితే వీరి మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండడంతో వారి వైవాహిక జీవితం లో సరిగా మెలగలేకపోయారు.

ఇదే సమయంలో సలేహా బేగంకు అక్కడ వున్నా ఖురేషీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అక్రమ సంబంధానికి దోహదపడింది. తరువాత వీరి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త మహ్మద్ ఖాజాను చంపితే పెళ్లి చేసుకోవచ్చని ప్రియుడితో కలిసి పథకం వేసింది.

ఈ పథకం లో భాగం గా ఖురేషీ మరో ముగ్గురు స్నేహితుల సహాయంతో తన భర్త ఖాజాకు ఫుల్ గా మద్యం తాగించి దారుణంగా హత్య చేయించింది. తరువాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని స్థానికంగా ఉన్న రైలు పట్టాలపై పడేశారు.

తరువాత ప్లాన్ లో భాగంగానే భార్య సలేహా బేగం తన భర్త కన్పించడంలేదని ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, చివరకు ఖాజా మృతదేహాన్ని పట్టాలపై గుర్తించారు. అయితే మృతదేహంపై కొట్టిన ఆనవాళ్లు కన్పించడంతో కేసును సనత్‌నగర్ పోలీసులకు బదిలీ చేసి దర్యాప్తు చేశారు.

ఈ దర్యాప్తులో పోలీసులకు కళ్లు చెదిరిపోయే విషయాలు తెలిశాయి. ఇదంతా భార్యే చేసి ఉండొచ్చని అనిమానించిన పోలీసులు తమదైన స్టయిల్లో సలేహా బేగాన్ని విచారించారు. దీంతో అసలు బండారం బయటపడింది.ప్రియుడు ఖురేషీతోనే భర్త ఖాజాను చంపినట్లు ఒప్పుకుంది సలేహా బేగం. ఖాజా భార్య సలేహా బేగంతో పాటు ప్రియుడు ఖురేషీ, ముజీబ్, అయాజ్, అక్బర్ బేగ్, జబీర్ తో స‌హా మ‌రో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు స‌న‌త్‌న‌గ‌ర్ పోలీసులు.

Related News