టాప్ 300 గ్లోబల్ సిటీస్ జాబితాలో హైదరాబాద్ కు స్థానం దక్కింది. రియల్ ఏస్టేట్ కంపెనీ జేఎల్ఎల్ టాప్ 300 గ్లోబల్ సిటీస్ జాబితాను ఈ మధ్య విడుదల చేసింది. ఈ జాబితాలో భారత దేశానికి చెందిన మొత్తం 9 నగరాలకు స్థానం దక్కింది. ముంబయి, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణె, సూరత్ నగరాలు టాప్ 300 గ్లోబల్ సిటీస్ జాబితాలో ఉన్నాయి.
నగరాలలో కమర్షియల్ యాక్టివిటీస్, ఇంటరెస్ట్, వాల్డ్ ఎకానమీ, రియల్ ఏస్టేట్ ఇన్వెస్ట్ మెంట్, జీడీపి వంటి కొని అంశాలను పరిగణనలోకి తీసుకున్న జేఎల్ఎల్ గ్లోబల్ జాబితాను రూపొందించింది. గ్లోబల్ టాప్ 30 లో న్యూఢిల్లీ, ముంబయి నగరాలు చోటు సంపాదించగా... గ్లోబల్ టాప్ 100 లో బెంగళూరు, చెన్నై, కోల్ కతా నగరాలు చోటు దక్కించుకున్నాయి.
ఇక హైదరాబాద్ జస్ట్ 100 కంటే ఒక్క స్టెప్ పైన ప్లేస్ కొట్టేసింది. జీడీపీ పరంగా చూస్తే.. 17 వ ప్లేస్ లో ఉన్న ముంబయి, 22 వ ప్లేస్ లో ఉన్న ఢిల్లీ జీడీపీ రెండింటివి కలిపి 400 బిలియన్ డాలర్లకు ఎక్కువే అని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
జీడీపీ, కార్పోరేట్ ప్రజెన్స్, ఐటీ కంపెనీలు, బ్యాంక్స్ లాంటి విషయాల్లో హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరాలతో పోటి పడటం నిజంగా హైదరాబాద్, తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ విషయం.