//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రపంచ టాప్ సెక్సీ నగరాలలో హైదరాబాద్ కు 89వ ర్యాంక్ !

Category : national

ప్రపంచంలోని టాప్-100 సెక్సీ నగరాలలో హైదరాబాద్ కు స్థానం లభించింది. ప్రేమకు, రొమాన్స్‌కు రాజధానిగా పేరొందిన పారిస్‌ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. ప్రపంచంలో శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించే పట్టణాలు, నగరాలు ఏవనే అంశంపై ‘ద మోస్ట్‌ సెక్స్‌ పాజిటివ్‌ సిటీస్‌ ఇన్‌ ద వరల్డ్‌’ పేరుతో అడల్డ్‌ యాప్‌ లజీవా నిర్వహించిన ఆసక్తికరమైన అధ్యయనంలో తేలిందిది. 

మొత్తం 200 పట్టణాల్లో ఈ అధ్యయనం నిర్వహించి టాప్‌ 100 పట్టణాలను ప్రకటించగా భారతకు చెందిన ఐదు నగరాలు ఆ జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. 71వ ర్యాంకు సాధించిన ముంబై మనదేశంలోని నగరాల్లో అగ్రస్థానంలో నిలవగా, ఢిల్లీ 78వ ర్యాంకుతో రెండో స్థానం దక్కించుకుంది. హైదరాబాద్‌ 89 ర్యాంకుతో మూడవ స్థానంలో నిలిచింది. కోల్‌కతా, చెన్నై మన వెనకాలే 90, 91 ర్యాంకులతో సరిపెట్టుకున్నాయి.

ఆరోగ్యకరమైన, సురక్షితమైన శృంగారాన్ని ప్రోత్సహించడం ద్వారా సెక్స్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే చేపట్టినట్టు లజీవా సంస్థ తెలిపింది.

మన దేశంలోని నగరాలలో శృంగారంలో ఆసక్తిగా పాల్గొనే విషయంలో ముంబై  అగ్రస్థానంలో ఉండగా, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ ఆ తరువాత వరుసలో ఉన్నాయి. హైదరాబాద్‌ అట్టడుగు స్థానంలో ఉంది. శృంగారంలో పాల్గొనే విషయంలో అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్‌ పోర్న్‌ చూడ్డంలో మాత్రం టాప్‌లో ఉంది. 

శృంగారంలో ఆసక్తిగా పాల్గొనకపోయినా పాల్గొన్నప్పుడు సంతృప్తి పొందడంలో మాత్రం హైదరాబాదీలు మిగతా నగరాల కంటే ముందున్నారు. పోర్న్‌ కోసం నెట్‌లో వెతికేటప్పుడు ఈ 5 నగరాల ప్రజలలో ముంబైవాసులు ‘భాభీ’ అనే పదంతో, ఢిల్లీవారు ‘వైఫ్‌’ పదంతో, హైదరాబాదీలు ‘కాలేజ్‌ గర్ల్స్‌’, కోల్‌కతావాసులు ‘బెంగాలీ’, చెన్నైవాసులు ‘తమిళ్‌’ పదాలతో సెర్చ్‌ చేస్తారట.