//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భార్యకు పెళ్లి చేసిన భర్త

Category : national

వివాహేతర సంబందాలు, అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్ళిళ్ళు చెయ్యడం ఇలా చాలా వరకు మగవాళ్ళ పాలిట శాప౦గా మారింది. పెళ్లి అయిన పదేళ్ళు అయిన వివాహేతర సంబందాలు పెట్టుకుని భర్తలను హత్య చెయ్యడం.. లేదా ఇతరులను ప్రేమించిన పెద్దలు వినకుండా వివాహాలు చెయ్యడం వంటివి హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. తాజాగా ఇలాంటిది జరగకుండా ఒక భర్త జాగ్రత్త పడి భార్యకు వివాహం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

కాన్పూర్ సమీపంలోని శనిగ్వాన్ గ్రామానికి చెందిన సుజిత్ శ్యామ్ నగర్ వాసి అయిన శాంతిని ఈ ఏడాది ఫిబ్రవరి 19వతేదీన వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం 15 రోజులకే నవ వధువు శాంతి అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది. శాంతి పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో భర్త సుజిత్ ఏమైందని భార్యను అడిగాడు. తాను లక్నోకు చెందిన రవి అనే యువకుడిని ప్రేమించానని,

తన ఇష్టానికి వ్యతిరేకంగా పెద్దలు పెళ్లి చేశారని శాంతి భర్తకు చెప్పింది.దీంతో సుజిత్ శాంతి తల్లిదండ్రులను ఒప్పించి ఆమె ప్రియుడితో పెళ్లి చేస్తానని భార్యకు మాటిచ్చాడు. భార్యకు ఇచ్చిన మాట ప్రకారం సుజిత్ రవిని కలిసి పెళ్లికి ఒప్పించాడు. శనిగ్వాన్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో సుజిత్ కొద్దిమంది అతిధుల సమక్షంలో భార్య శాంతి, ప్రియుడు రవిల వివాహం జరిపించాడు. దీనిపై ఆ యువకుడిని పలువురు అభినందిస్తున్నారు.