//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Category : world

కొందరు భార్యాభర్తలు మనస్పర్దలు లేకా వేరు వేరు కారణాల వలన గొడవ పడుతూ ఉంటారు. ఈ గొడవలే ఒక్కోసారి విడాకులవరకు వెళతాయి. అలాంటి ఘటనే ఒకటి ఇండోనేసియాలో జరిగింది. ఇక విషయానికి వస్తే ఇండోనేషియాకు చెందిన డ్వి సుసిలార్టో - హెర్మి సెత్యోవాటి అనే దంపతులు ఉన్నారు. వీరిమధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టుకెక్కారు. ఈ కేసును విచారించిన కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. విడాకులు ఇచ్చినప్పటికీ మీ భార్యకు భరణం చెల్లించాల్సిందేనంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత కోర్టు ఆదేశం మేరకు కొన్ని నెలల పాటు భరణం చెల్లిస్తూ వచ్చాడు.

ఆ తరువాత కొన్ని ఆర్ధిక కారణాలవలన గత 9 నెలలుగా సుసిలార్టో మాజీ భార్యకు భరణం డబ్బులు చెల్లించలేక పోయాడు. దీంతో ఆమె మరల కోర్టుకెక్కింది. ఈ విషయ తెలుసుకున్న సుసిలార్టో మరింత ఆగ్రహం చెంది.. ఎలాగైనా ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో 890 కేజీల బరువున్న 10,500 డాలర్లను భరణం కింద ఇచ్చాడు.

తాను చెల్లించాల్సిన భరణం మొత్తం 10500 డాల్లరు (సుమారుగా రూ.7,33,586)ను నాణేల రూపంలో సేకరించి వీటిని కోర్టుకు తీసుకెళ్లి జడ్జి ముందు తన మాజీ భార్య తరపు న్యాయవాదికి అందజేశాడు. వీటిని చూడగానే ఆ లాయర్‌ కోపంతో సుసిలార్టోతో కోర్టులోనే జడ్జి ముందే గొడవకు దిగాడు. అన్ని కాయిన్లను లెక్కబెట్టలేక ఆ లాయర్.. సుసిలార్టోను కొట్టినంత పనిచేశాడు.

దీనిపై సుసిలార్టో మాట్లాడుతూ, 'చిన్న ఉద్యోగం చేసుకొనే తాను అంత డబ్బును ఒకేసారి ఇవ్వలేక... తన స్నేహితులను సాయం చేయాల్సిందిగా కోరాను. వాళ్లంతా తనకు కాయిన్ల రూపంలోనే ఆ మొత్తం ఇచ్చారని, అందుకే తనకు మరో దారి లేక అదే డబ్బును భరణంగా ఇచ్చినట్లు చెప్పాడు. అంతేగానీ, తన మాజీ భార్యను అవమానించాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదని చెప్పాడు. అయితే సుసిలార్టో వాదనతో ఏకీభవించిన కోర్టు.. ఆ నాణేలను లెక్కించేందుకు కోర్టు సిబ్బందిని నియమించింది. మొదట్లో ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించిన తన మాజీ భార్య తర్వాత మరో దారి లేక ఆ మొత్తాన్ని తీసుకుంది.

Related News