//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డేరా శిబిరంలో వందలాది `ఆత్మహత్య దళాలు' ?

Category : national

డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్  రామ్ రహీమ్ సింగ్ కు అత్యాచారం కేసులో శిక్షపడి జైలుకు వెళ్లిన తరువాత చెలరేగిన విధ్వసం, ఈ సందర్భంగా గుర్మీత్ పై వస్తున్న పలు ఆరోపణలపై విచారణకు ముందుకు వెళ్ళడానికి డేరా శిబిరంలో వందలాది  `ఆత్మహత్య దళాలు' ఉన్నాయన్న సమాచారం పోలీస్ లకు ఆందోళన కలిగిస్తున్నది. డేరా శిబిరంలో సోదాలు చేసిన సందర్భంగా అందుకు ఆధారంగా ఉండే పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

"నేను నా జీవితాన్ని డేరా సచ్చా సౌదా ప్రోత్సహిస్తున్న మానవత్వం కోసం అంకితం చేస్తున్నాను. నేను ప్రమాదవశాత్తు గాని, మారే  విధంగా గాని చనిపోతే అందుకు నేనే బాధ్యత వహిస్తాను. నా మరణానికి మరెవ్వరు బాధ్యులు  కాబోరు. డేరా సచ్చా సౌధా కూడా బాధ్యత వహించదు. నా వారసులు లేదా కుటుంబ సభ్యులు ఎవ్వరికీ డేరా సచ్చా సౌదాను నా మరణానికి బాధ్యత వహించేటట్లు చేసే అధికారం లేదు" అంటూ 2015 అక్టోబర్ 20 తేదీతో సిర్సా లో నివాసం ఉండే ఇందు అనే మహిళా ఒక అఫిడవిట్ పై సంతకం చేసింది. 

డేరాకు సంబంధించిన పలు నేరాల గురించి సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన అనంతరం ఇటువంటి అనేక పత్రాలు దొరికాయి. రిజిస్టర్ చేసిన స్టాంప్ పేపర్ పై తయారు చేసిన ఇటువంటి పాత్రలు అనేకం గుర్మీత్ కు శిక్ష పడిన అనంతరం వెలుగులోకి వస్తున్నాయి. డేరా బాబా తన అనుచరులలో `ఆత్మాహుతి దళాలు' ను తయారు చేసుకున్నట్లు ఈ పత్రాలు నిర్ధారిస్తున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. గుర్మీత్ పై కేసులకు సంబంధించిన దర్యాప్తును ముందుకు పోనీయకుండా నిరోధించడం కోసం ఆయన అనుచరులు ఎటువంటి తీవ్ర చర్యలకైనా సిద్ధంగా ఉన్నల్టు స్పష్టం అవుతున్నది.

 సీబీఐ కోర్ట్ శిక్షాకాలాన్ని ప్రకటించిన ఆగష్టు 27న పోలీస్ లు అంబాలా వద్ద ఇద్దరు వ్యక్తులను రూ 38 లక్షల నగదుతో అరెస్ట్ చేశారు. ఆ రోజున విధ్వసం సృష్టించడం కోసమే ఈ డబ్బు తీసుకు వచ్చిన్నట్లు వెల్లడైనది. సిర్సాకు చెందిన షీలా రాణి అనే మహిళా 2005లో తయారు చేసిన అఫిడవిట్ లో నేరుగా సీబీఐ పై ఆరోపణలు చేశారు. 

"గత మూడేళ్ళుగా సీబీఐ డేరా గురించి దర్యాప్తు జరుపుతూ డేరా అధిపతినిని, మేనేజర్ లను,  సేవాదర్ లను తప్పుడు కేసులలో  ఇరికించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐ తన కేసులను ఉపసంహరించుకొనే వరకు  ఆమరణ నిరాహారదీక్షకు కూర్చోవాలని  నేను ఎటువంటి వత్తిడి లేకుండా నిర్ణయం తీసుకున్నాను. ఆ విధంగా నేను చనిపోతే, అందుకు నాదే బాధ్యత, ఎటువంటి బాహ్య వత్తిడులు లేవు" అని అందులో ఆమె పేర్కొన్నారు. 

ఆ విధంగా వందలాది `ఆత్మహత్య దళాలు' డేరా శిబిరంలో ఉన్నట్లు తెలుస్తున్నది. శిబిరంలో మరింత లోతుగా దర్యాప్తుకు పోతే పరిస్థితులు ఎటువంటి వెడుతూ ఉంటాయో అని సీబీఐ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మరో వంక డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ కు శిక్ష, అరెస్టు అనంతరం హర్యానా, పంజాబ్ లలో జరిగిన అల్లర్లపై హైకోర్టు సీరియస్ అయ్యింది. రెండు రాష్ట్రాలలోనూ పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నదని వ్యాఖ్యానించింది. ఈ అల్లర్లపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. శాంతి భద్రతల పరిరక్షణలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ఘోరంగా విఫలమయ్యాయని వ్యాఖ్యానించింది.