Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఓటరును ఆకర్షిస్తున్న నోట్లు.... జూపూడి ఇంటి వద్ద భారీగా డబ్బు లభ్యం..!

Category : politics state

ఇప్పటికైతే పలుచోట్ల వచ్చిన సమాచారం మేరకు పోలీసుల దాడుల్లో భారీగానే డబ్బు మద్యం దొరికినట్లు తెలుస్తుంది .రేపు ఎలక్షన్లు జరగనున్నాయి కావున ఈ రోజు రాత్రికి రాత్రే ఇంకెంత డబ్బులు మద్యం బాటిళ్లు చేతులు మారనున్నాయి. ఇంకెంత స్థాయి లో పట్టు బడనుందో వేచి చూడాల్సిందే... అయితే  నిన్నటి తో  ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో ప్రజా ఓటర్లను నాయకులు ఆకర్షించే ప్రయత్నం లో భాగంగా డబ్బులు, మద్యం పంపడం సర్వసాధారణం కానీ ఈ పంపిణీ లో మాత్రమ్ దొరికిపోవడం అంటేనే కొంచెం ఆలోచించాల్సిన విషయం..

ఈ రకంగా నే  ఎన్నికల వేళ ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాక ర్‌రావు నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఓ ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని జూపూడి నివాసానికి చేరుకున్నారు వారి  రావడం అనుమానం కలిగించడంతో అక్కడే ఉన్న   టీఆర్‌ ఎస్‌ శ్రేణులకు   వెంటనే  పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రావడం గమనించిన ఆ వ్యక్తులు వెంటనే అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.


దీంతో పోలీసులు హుటాహుటిన జూపూడి నివాసానికి రావడంతో ఆ ముగ్గురు 3 బ్యాగులతో జూపూడి నివాసం వెనుక గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్‌ కార్యకర్తలు వెంబడించి ఒకరిని పట్టుకోగా, ఇద్దరు పారిపోయారు. దొరికిన వ్యక్తిని, అతడి వద్ద ఉన్న రూ.17.50 లక్షలను పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడిని పోలీసులు ఠాణాకు తరలించారు. పారిపోయిన ఆ ఇద్దరు వ్యక్తుల వద్ద భారీ ఎత్తున నగదు ఉందంటూ టీఆర్ఎస్‌ కార్యకర్తలు జూపూడి నివాసం ఎదుట ధర్నాకు దిగారు.

ఓటర్లకు పంచేందుకే ఈ నగదు తీసుకొచ్చినట్లు వారు ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడ్డదారిలో ప్రజా బలం పొందడమే ధ్యేయంగా నాయకులు విచ్చలవిడిగా డబ్బు మద్యాన్ని పేదవారికి పంచి ఆకర్షించే విధంగా ఈ విధమైన పనులకు అడుగులు వేస్తున్నారు.. కానీ పోలీస్ శాఖ ఎక్కడ సమాచారం మేరకు అక్కడకు చేరి వాటిని అరికట్టే విధంగా దాడులు చేసి పెద్ద ఎత్తున డబ్బును మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు . ఎంత అరికట్టిన ఎక్కడో ఒక చోట ఇలాంటి పరిస్థితులు  కనిపిస్తూనే ఉన్నాయి అలాగే ఈ నేపథ్యంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కుడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట మండలం సిద్దార్థ నగర్‌లోని ఓ ఇంట్లో బుధవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేపట్టారు. పక్కా సమాచారంతో అమృతరావు అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసి భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడిన డబ్బు సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ సొమ్ము వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి టీజేసీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన డాక్టర్‌ పగిడపాటి దేవయ్యకు చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అమృతరావు ఇంట్లో వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబందించిన వివిధ గ్రామాల పేర్లతో చిట్టీలు లభ్యమవడం పోలీసుల అనుమానానికి బలం చేకూర్చింది.