Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సంక్రాంతి పూజ ఎలా చెయ్యాలి...

Category : history

మకర సంక్రాంతి రోజు దానధర్మాలు చెయ్యడం ద్వారా గత జన్మ దారిద్ర బాధలు అన్ని తొలిగిపోతాయి. సంక్రాంతి రోజు స్త్రీలు పసుపు, కుంకుమ, పండ్లు, పూలు దానం చెయ్యడం ద్వారా సకలసంపదలతో జీవితాంతం దీర్ఘసుమంగలిగా ఉంటారు. సంక్రాంతి పండుగ ఒంటరిగా రాదు అని పెద్దలు అంటూ ఉంటారు. మహారాణిలా ముందు 'బోగీ' ని వెనుక 'కనుమ' ను వెంటేసుకొని చెలికత్తెల మధ్య రాకుమార్తెలా సంక్రాంతి వస్తుంది అని అంటారు. సంక్రాంతి రోజున పితృదేవులకు పూజలు చెయ్యడం వలన శుభాశీస్సులతో వర్ధిల్లుతారని పురోహితులు అంటుంటారు.

సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి, పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. పూజ గదిని ముగ్గులతో అలంకరించాలి. ఇక స్త్రీలు ఇంటి ముందు పెద్ద పెద్ద రంగులతో ముగ్గులని వేసి అలంకరించుకోవాలి.

సంక్రాంతి వచ్చింది అంటే హరిదాసులు హరినామం చేసుకుంటూ కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమని చిందులు తొక్కుతూ తలపై రాగి అక్షయపాత్ర పెట్టుకుని వస్తారు. ఇక చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలను అనుగుణంగా వాటిచేత నృత్యాలు చేయిస్తు తీసుకొస్తారు. వారి తీరులలో భక్తి గీతాలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇళ్ల పెద్దలు పుణ్యలోకాల్లో ఉండాలని దీవిస్తూ ఆ పాటలు పడుతుంటారు.

ఈ సంక్రాంతి రోజు గుమ్మడి పండ్లను దానంగా ఇస్తుంటారు. ఈ పండ్లను దానం ఇస్తే విష్ణువుకు దానం ఇచ్చిన ఫలం లభిస్తుంది అని విశ్వసిస్తారు. ఇంట్లో చేసిన ప్రతి పలహారాన్ని దేవుడికి నైవేధ్యంగా పెట్టాలి. మకర సంక్రాంతి రోజున ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి, వారికి కొత్త బట్టలు పెట్టి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలను ఆచరిస్తారు.

Related News