//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రంజాన్‌ ముందు రోజు ఎంత దానం ఇవ్వాలి ?

Category : editorial

 ఇస్లామ్‌ సంప్రదాయంలో ప్రత్యేకంగా కనిపించే దానధర్మాలు  రంజాన్‌ మాసంలో ఇంకా ప్రత్యేకంగా కనిపిస్థాయి.  నెల రోజుల పాటు పవిత్ర ప్రార్థనలతో, రోజూ కఠిన ఉపవాసంతో పవిత్రంగా జీవితం గడిపిన మహమ్మదీయ సోదరులు నెలవంక దర్శనంతో ‘ఈద్‌-ఉల్‌-ఫితర్‌’ పండుగ చేసుకోవడానికి సిద్ధపడే సమయం రానే వచ్చింది. 

భక్తి శ్రద్ధలతో ఇంతకాలం సాగించిన దీక్షకు ముగింపు ముందు ముస్లిమ్‌ సోదర సోదరీమణులు పాటించే సంప్రదాయం - లేని వారికి దానం చేయడం! పేదవారు కూడా సగర్వంగా తలెత్తుకు తిరిగేలా, తోటివారు కూడా సంతోషంగా ఈ పవిత్రమైన పండుగ చేసుకొనేలా వీలు కల్పించడం! మహమ్మదీయ పరిభాషలో వీటిని ‘జకాత్‌’, ‘ఫిత్రా’ అని అంటారు.

పండుగకు ‘ఈద్‌’ ప్రార్థనలు చేయడాని కన్నా ముందు బీదసాదలందరికీ ధర్మం చేయాలని విధి. అలా చేసే దానధర్మాలనే ‘ఫిత్రా’ (లేదా ‘ఫిత్ర్‌’) అంటారు. సర్వసాధారణంగా గోదుమ ధాన్యాల రూపంలో కానీ, నగదు రూపంలో కానీ ఇలా ధర్మం చేస్తారు. ఇలా చేయడం వల్ల నిరుపేదలు సైతం అందరితో కలసి పండుగను బాగా జరుపుకోగలుగుతాడనేది అంతరార్థం.

రంజాన్‌ పండుగ ముందురోజున బీదవారికి ఎంతైనా దానం, ధర్మం చేయవచ్చు. ఎంత ఎక్కువ ఇస్తే, అంత ఫలితం అంటారు.  అయితే ఒక్కో మనిషి సుమారు 2.25 కిలోల గోదుమలు. లేదంటే, దానికి సమానమైన విలువలో డబ్బు దానం ఇవ్వాలి. లేదంటే 2.25 కిలోల ఖర్జూరం కానీ, ఎండు ద్రాక్ష కానీ ఇవ్వచ్చు. వాటికి సమానమైన డబ్బు దానం చేయచ్చు. వీలైనంత వరకు డబ్బుగా కన్నా, ధాన్యం రూపంలో ‘ఫిత్రా’ ఇవ్వడం మంచిదని మహమ్మదీయ పండితుల చెబుతారు.