//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐటి నగరాల్లో 20 శాతం తగ్గనున్న గృహాల అద్దె !

Category : business

 దేశీయ సాఫ్ట్‌వేర్, సేవల హబ్‌గా కొనసాగుతున్న ప్రధాన నగరాల్లో గృహాల అద్దె 20 శాతం వరకు తగ్గనున్నదని ఇండస్ట్రీ బాడీ అసోచామ్ అంచనావేస్తున్నది. జూలై నుంచి ఆరంభంకానున్న వచ్చే మూడేండ్లకాలంలో ఐటీ రంగంలో సెంటిమెంట్ నిరాశావాదంగా ఉంటుందన్న అంచనాతో గృహాల అద్దెపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. 

ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉందని అసోచామ్ సర్వేలో వెల్లడైంది. ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పడుతుండటం, వేతన పెంపు చాలా తక్కువ స్థాయిలో ఉండటంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం మందకొడిగా కొనసాగుతుండటంతో ఇండ్ల అద్దెలు తగ్గడానికి ప్రధాన కారణమని పేర్కొంది. ప్రస్తుతం అద్దెకు ఉన్నవారు మెరుగైన పరిస్థితులకోసం వేచి చూస్తున్నారని, నెలవారి చెల్లింపులు పెరుగడానికి వారు ఇష్టపడటం లేదని సర్వేలో తెలిపింది.

నెలకు రూ.50 వేల కంటే అధికంగా రెంట్ చెల్లిస్తున్న వారిపై అసోచామ్ ఈ సర్వేను నిర్వహించింది. బెంగళూరుతోపాటు చెన్నై, హైదరాబాద్‌లో ఇండ్ల అద్దెలు 10-15 శాతం వరకు తగ్గనున్నదని పేర్కొంది. పుణెలో మాత్రం 20 శాతం వరకు తగ్గనున్నాయట. దేశరాజధాని ఢిల్లీ పరిసరప్రాంతాల్లో కూడా రెంట్లు 15 శాతం కరెక్షన్‌కు గురి అవ్వనున్నాయని వెల్లడించింది. 

ఉద్యోగ నియామకాల్లో నిస్తేజం ఉన్నప్పటికీ నాలుగు నుంచి ఐదు పెద్ద నగరాల్లో ఐటీ రంగంలో 40 లక్షల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. ఐటీ, ఆర్థిక సేవల రంగాలు అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నప్పటికీ ఈ రంగానికి చెందిన సిబ్బంది తొందరగా టెంప్ట్ అవుతున్నారని చెప్పారు.