//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

Category : politics national

కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామిని ఇప్పుడు ఒక నివాసం భయపెడుతుంది. అదే ముఖ్యమంత్రి అధికారిక నివాసం. ఆ నివాసంలోకి వెళ్ళిన ఎవరు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు.ఈ నివాసంలో ఉన్న సీఎంలు ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట. దేవెగౌడ 1994లో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ‘అనుగ్రహ’లోనే ఉండేవారట. అయితే ఆ తర్వాత రాజకీయ పరిణామాల వల్ల 1996మే వరకూ మాత్రమే దేవెగౌడ సీఎంగా పనిచేసినట్లు తెలిసింది.

అనంతరం ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టారు. దేవెగౌడ సీఎం పదవిని వదులుకుని పీఎం అయ్యారు కానీ.. అనంతరం ఈ నివాసంలో దిగిన ఎస్‌ఎం కృష్ణ, ఎన్ ధరమ్ సింగ్, డీవీ సదానంద గౌడ.. వీరిలో ఏ ఒక్కరూ పూర్తి కాలం పదవిలో కొనసాగలేదట. 2006లో కుమారస్వామి కూడా సీఎం అయిన తర్వాత ఈ బంగళాలోనే ఉన్నారట. ఆ సమయంలో కుమారస్వామి సోదరుడు ఈ బంగళాలో వాస్తు సమస్యలు ఉన్నట్టు గుర్తించి.. మార్పులుచేర్పులు చేయించారట. అయితే బీజేపీ సహకారంతో సీఎం అయిన కుమారస్వామి..

2007డిసెంబర్‌లోనే పదవికి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది.దీంతో కుమారస్వామి ‘అనుగ్రహ’లో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఇదిలా ఉంటే, ఈ ఇంటి గురించి మరో పుకారు కూడా ప్రచారంలో ఉంది. ఈ బంగళాకు సమీపంలో ఉన్న రైలు పట్టాలపై చాలామంది ఆత్మహత్య చేసుకున్నారని.. వారి ఆత్మలు దెయ్యాలై ఈ బంగళాలో సంచరిస్తున్నాయని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పైగా.. చీఫ్ సెక్రటరీ రత్నప్రభ ఉంటున్న అధికారిక నివాసం వాస్తుపరంగా బాగుందని కుమారస్వామి భావిస్తున్నారు. అయితే రత్నప్రభ జూన్ 30వరకూ విధుల్లో కొనసాగనున్నారు.