Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్నికల సిత్రాలు .. ఉదయం వైసీపీలో చేరి సాయంత్రానికి టీడీపీకి మారిన నాయకులు

Category : politics state

ఏపీలో ఎన్నికల చిత్రాలు అన్నీ ఇన్ని కావు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రోజుకో రకమైన విచిత్ర సంఘటన చోటుచేసుకుంది . ఉదయం వైసీపీలో చేరిన కొందరు తిరిగి సాయంత్రానికే టిడిపి బాట పట్టి తూచ్ అదేం లేదు అంటూ అందరినీ అవాక్కయ్యేలా చేసిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన కొందరు కార్యకర్తలు ఉదయం ఒక పార్టీ లో చేరి.. సాయంత్రం కల్లా తిరిగి తమ సొంత పార్టీలోకిచేరిపోయారు.

అసలు విషయానికి వస్తే వ్యక్తిగత కారణాలు ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న తమను ఆదుకుంటామని ప్రతిపక్ష పార్టీ నాయకుల మాటలు నమ్మి ఉదయం టీడీపీని వదలి వైసీపీలో చేరామని పార్టీలో చేరిన తరువాత ఆ పార్టీ నాయకులు చెప్పిన మాటలు అబద్దమని తెలిసి తిరిగి సాయంత్రానికి తెలుగుదేశం పార్టీలో చేరిన కార్యకర్తల సంఘటన మండల పరిధిలోని మునగోడు గ్రామంలో జరిగింది.

గ్రామానికి చెందిన కొందరు స్థానిక నాయకుల మాటలు విని నియోజకవర్గ ఇన్‌చార్జి నంబూరి శంకరరావు సమక్షంలో క్రోసూరు పార్టీ కార్యాలయంలో వైసీపీలో చేరారు. కండువాలు వేసిన తరువాత తమను ఆదుకుంటామని చెప్పి భోజనం పెట్టి పంపించారని, కోపంతో మరలా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ వద్దకు వచ్చి తాము తప్పు చేశామని తాము టీడీపీ కట్టుబడి ఉంటామని మళ్లీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ విచిత్రం చూసిన వాళ్ళంతా నోరెళ్ళబెట్టి మరీ అవాక్కయ్యారు.

Related News