//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హాట్‌.. హాట్‌గా భూపాల‌ప‌ల్లి పాలిటిక్స్‌.. ఆ న‌లుగురిలో గెలిచేది ఎవ‌రో తెలుసా..?

Category : politics

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నేతల త‌ల‌రాత‌ల‌ను మార్చిన సింగ‌రేణి కార్మికులు ఈ సారి ఎన్నిక‌ల గురించి ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు. రాష్ట్రా స్థాయి కీల‌క నేత‌లు ఇక్క‌డ్నుంచి స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా మాజీ స్పీక‌ర్, సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ధుసూద‌నాచారి ఇంకోసారి బరిలోకి దిగారు. ఇప్ప‌టికే గ్రామాల్లో పర్య‌టిస్తూ ముమ్మ‌రంగా ప్ర‌చారం చేస్తున్నారు.

కాంగ్రెస్ కీల‌క నేత గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి కూడా ఇదే సీటు నుంచి పోటీ చేస్తున్నారు. 2009లో ఇక్క‌డ్నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ర‌మ‌ణారెడ్డి ఆ త‌రువాత 2014లో ఓడిపోయారు.ఈ సీటు నుంచి ఈ సారి ఎలాగైనా గెల‌వాల‌ని ఆయ‌న విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు.

భూపాల‌ప‌ల్లి టిక్కెట్ ఆశించి టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు కూడా ఇప్పుడు ఇండిపెండెంట్‌గా బ‌రిలోకి దిగ‌బోతున్నారు. మూడు ద‌శాబ్దాల రాజ‌కీయ జీవితంలో అన్ని విధాలుగా పార్టీలు మోసం చేశాయ‌ని, ఒక్క‌సారి ఛాన్స్ ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నారు.

ఈ ముగ్గురు కీల‌క‌నేత‌ల‌తోపాటు బీజేపీ అభ్య‌ర్థిగా చందుప‌ట్ల కీర్తిరెడ్డి కూడా పోటీ చేయ‌బోతున్నారు. రాజ‌కీయ జీవితంలో మొట్ట మొద‌టిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన కీర్తిరెడ్డి ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన ఆమె సింగ‌రేణి గ‌నుల‌పై కాషాయ కండువా ఎగుర వేయాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. న‌లుగురు కీల‌క నేత‌ల స‌మ‌రంతో భూపాల‌ప‌ల్లి పాలిటిక్స్ హాట్‌హాట్‌గా కొన‌సాగుతున్నాయి.