//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Trisha Krishnan Movies : త్రిష కృష్ణన్ సినిమాలు : Hot Actress Trisha Krishnan photos family images videos love affair marriage galleries caste bio data

Category : editorial

త్రిష లేదా త్రిష కృష్ణన్ తెలుగు మరియు తమిళ్ సినిమా నటీమణి.ఈమె చెన్నై మహానరంలో కృష్ణన్ మరియు ఉమా దంపతులకు 1983లో జన్మించింది. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.

చెన్నైలో తన తల్లిదండ్రులు మరియు బామ్మతో కలిసి నివసిస్తున్నది.ఈమె మాతృభాష తమిళం.త్రిష మొదటి తెలుగు చిత్రం నీమనసు నాకు తెలుసు.తరువాత చిత్రం గా వర్షం చేసింది .ఈ సినిమా ప్రభాస్ తోలి నాళ్ళ కెరియర్ లో భారీ విజయాన్ని చూసింది.దీనితో త్రిషకు మంచి పేరు వచ్చింది.ఆమె కు తెలుగు సినిమాల్లో ఆఫర్లు కూడా వెల్లువలా వచ్చి పడ్డాయి.

త్రిష తెలుగు,మలయాళం,తమిళ్.కన్నడ,హిందీ సినిమా లల్లో నటిస్తున్నది.కథానాయిక త్రిషకు అరుదైన పురస్కారం దక్కింది. యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్ హోదాకు ఆమె ఎంపికైంది. చిన్నారులు, యువత హక్కులను కాపాడేందుకు ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్లు యునిసెఫ్ ప్రతినిధులు తెలిపారు.

ఇంతకుముందు అమితాబ్ బచ్చన్, ప్రియాంకా చోప్రా, సచిన్ టెండూల్కర్‌కు మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది. ఎనీమియా (రక్తహీనత), బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, చిన్నారులపై వేధింపులు తదితర అంశాల్లో పిల్లలకు అవగాహన కల్పించడానికి త్రిష గత కొంత కాలంగా విశేష కృషి చేస్తోంది. ప్రత్యేకించి తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో ఆమె చాలా మంది చిన్నారులకు మద్దతుగా నిలిచింది.

దక్షిణ భారతదేశం నుంచి యునిసెఫ్ రాయబార హోదా పొందిన తొలి నటి త్రిషే కావడం విశేషం. ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని త్రిష పేర్కొంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మరింత ఉత్సాహంగా పని చేస్తానని ఆమె తెలిపింది.

ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి.తెలుగు సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా గాను ఆమె నంది అవార్డ్ వరించింది.