సాయిపల్లవి ఒక సినీ నటి.ఈమె జూన్ 9, 1992 లో జన్మించింది.సాయిపల్లవి ది తమిళనాడులోని కోటగిరి దగ్గర ఓ చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది.
తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె మరియు చెల్లెలు పూజ కవల పిల్లలు. ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో జార్జియా లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడు.
వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.
ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ లో సంచలనం సృష్టించింది .వరుణ్ తేజ్ హీరో గా సినిమా వచ్చింది.ఫిదా అంట పెద్ద విజయం సాధించటానికి భానుమతి క్యారెక్టర్ చాల వరకు ఉపయోగపడింది. తర్వాత నాని సరసన ఎం. సి. ఏ చిత్రం లో నటించింది.
ఆ తరువాత నాని సరసన ఎం. సి. ఏ చిత్రం లో నటించింది.ఈచిత్రం కూడా మంచి విజయాన్ని అందించింది.ఎప్పుడు తమిళం లో సూర్య సరసన ఒక సినిమా చేస్తుంది.స పల్లవి ని హీరోయిన్ గా పెట్టి సినిమాలు తీయడానికి తెలుగు నిర్మాతలు ఉత్సహం చూపుతున్నారు.