//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Poonam Kaur Movies : పూనమ్ కౌర్ సినిమాలు : Hot Actress Ponam photos family images videos love marriage galleries caste bio data

Category : editorial

పూనమ్ కౌర్ తెలుగు సినిమా నటి మరియు మోడల్.పూనమ్, సరబ్-జిత్ సింగ్ (పంజాబీ) సుఖ్-ప్రీత్ (నిజామాబాద్) దంపతులకు హైదరాబాదులో జన్మించింది. హైదారాబాద్ పబ్లిక్ స్కూలులో చదివిన పూనమ్, ఆ తరువాత ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేసింది.

2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం తో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. అటుతరువాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్ మొదలైన చిత్రాలలో నటించింది.

హీరోల సరసన ఫ్యామిలీ టైపు రోల్స్ చేస్తూ వచ్చిన ఆమె, వినాయకుడు సినిమాలో చిట్టిపొట్టి దుస్తులతో అందరినీ ఆకర్షించింది. అయితే.. అది ఆమె కెరీర్ కు బూస్ట్ కాలేదు.

అలాంటి ఆమెను ఉన్నట్టుండి ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. తెలుగుదేశం అధికారిక పత్రికలు కూడా విషయాన్ని ధ్రువీకరించాయి. అవతల తెలంగాణలో సమంతను చేనేతకు అంబాసిడర్ గా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలోనూ ప్రకటించారేమోలే అనుకున్నారంతా. లోపల ఎవరి సిఫార్సుతో ఆమెను నియమించారు లోపల లొల్లి ఏంది అనేది పక్కన పెడితే, ఆమె నియామకం జరిగిందని వార్తలు వచ్చాయి.

అన్ని ప్రముఖ పత్రికల్లోనూ. ఆ పై ఆ హోదాలో ఆమె ఏపీలో పర్యటించింది కూడానండోయ్! చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె ఆయా కార్యక్రమాల్లో పాల్గొంది. అందుకు సంబంధించిన వార్తలు కూడా ప్రముఖంగా ప్రచురితం అయ్యాయి. పూనమ్ కౌర్ అధికారిక హోదాలోనే ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా వాటిల్లో ప్రముఖంగా పేర్కొన్నారు.

ఇప్పుడు ట్విస్టు ఏమిటంటే అసలు ఏపీలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎవరూ లేరని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించడం. పూనమ్ కౌర్ ను అంబాసిడర్ గా ప్రకటించినప్పుడు ఈ మంత్రిగారు చేనేత బాధ్యతల్లో ఉండినారు. ఆ తర్వాత మరో శాఖకు వచ్చారు. వివాదాల నేపథ్యంలో ఈయనను కదలిస్తే అబ్బే ఆమెను మేం నియమించనే లేదు, ఏపీలో అలాంటి హోదానే లేదు, చేనేతకు బ్రాండ్ అంబాసిడరే లేరు అని ఈయన చెప్పుకొచ్చారు.