//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Hansika Motwani Movies : హన్సిక మోత్వానీ సినిమాలు : Hot Actress Hansika Hansikha photos family images videos marriage galleries caste bio data

Category : editorial

హన్సికా మోత్వాని భారతీయ సినిమా నటి.హన్సికా బాల్య నటి గా కొన్ని సినిమాలు చేసింది. ముంబాయిలో హన్సికా మోత్వాని ఆగస్టు 9, 1991 లో జన్మించింది. హన్సిక తెలుగు, ఇంగ్లీషు, హిందీ మరియు తుళు భాషలు మాట్లాడగలదు. ఈమె తండ్రి ప్రదీప్ మోత్వానీ వ్యాపరస్తుడు మరియు తల్లి మోనా మోత్వానీ ప్రసిద్ధి చెందిన చర్మవైద్యురాలు. వీరిద్దరూ విడాకులు తీసుకొన్నారు.

హన్సిక చాలా సీరియళ్లలోను, సినిమాల్లోనూ చిన్నతనంలోనే నటించింది. 2001 నుంచే షకలక బూమ్ బూమ్, హమ్ దో హై, వంటి సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది.అవే కాకుండా హవా, కోయ్ మిల్ గయా, అబ్రక దబ్రా, జాగో వంటి సినిమాల్లో కూడా కనిపించింది.

2007లో పూరీజగన్నాధ్ తీసిన 'దేశముదురు' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టినీ తన వైపుకు సునాయాసంగా మళ్లించుకోగలిగింది.

తర్వాత 2008లో జూనియర్ ఎన్టీఆర్ పక్కన 'కంత్రీ'లో ఆడిపాడింది. రామ్‌తో 'మస్కా' చిత్రంలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. తర్వాత ప్రభాస్ నటించిన 'బిల్లా' సినిమాలో 'ప్రియ'గా గెస్ట్ రోల్‌లో నటించింది.

జయీభవ తో కల్యాణ్‌రామ్‌తో జతకట్టినా ఆ చిత్రం వూహించిన అంచనాలను చేరుకోలేకపోయింది. తర్వాత నితిన్‌తో సీతారాముల కల్యాణం లో నటించింది. అది కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దాంతోతన దృష్టిని తమిళ పరిశ్రమ వైపు మళ్లించింది.

అలా 2011లో మాప్పిళ్త్లె సినిమాతో తమిళంలో బోణీ కొట్టినా విజయం మాత్రం దక్కలేదు. అయినా వెనుకడుగేయకుండా హిట్ కోసం పట్టు బట్టి మరీ తమిళంలో సినిమాలు చేస్తూనే వచ్చింది.తమిళంలో విజయ్ సరసన నటించిన 'వెలాయుధం' సినిమాతో విజయాన్ని అందుకుంది.

అటు తమిళంలో సినిమాలు చేస్తూనే ఇటు తెలుగు సినిమాల పైనా దృష్టి సారించింది. కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, సమ్‌థింగ్.. సమ్‌థింగ్.. వంటి సినిమాలతో తెలుగు ప్రజల్ని పలకరిస్తూ హిట్‌లను తన ఖాతాలో జమ చేసుకుంది.

కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో కూడా 'ఆప్ కా సరూర్' సినిమాతో ఈ అమ్మడి లక్‌ని పరీక్షించుకుంది. అక్కడ కూడా హిట్ కొట్టడంతో 'మనీ హై తో హనీ హై' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

తన అందంతో ఎందరో కుర్రకారు మనసుల్ని ఉర్రూతలూగించిన హన్సిక తను శింభుకే సొంతమని అప్పట్లో ఓపెన్‌గా చెప్పేసింది. తమ గురించి హల్‌చల్ చేస్తున్న పుకార్లన్నిటికీ 'మేం లవ్‌లో ఉన్నమాట నిజమే' అంటూ ఫుల్‌స్టాప్ పెట్టేసిందీ జంట. కానీ, ఆ బంధం కాస్తా బెడిసికొట్టడంతో నా దృష్టంతా కెరీర్‌పైనే అని ప్రకటించింది.

కేవలం నటన పరంగానే కాకుండా మానవత్వం ఉన్న మనిషిగా కూడా హన్సికని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి పుట్టిన రోజుకీ ఒక అనాథ అమ్మాయి లేదా అబ్బాయిని దత్తత తీసుకుని ఆదరిస్తుందట! అలా ఈమె దత్తత తీసుకున్న పిల్లల సంఖ్య 20కి పైగానే ఉంటుంది.

ఈమెకు పాలంటే అస్సలు నచ్చవట. ఏ మాత్రం తీరిక దొరికినా వంట చేయడానికి ఆసక్తి చూపిస్తుందట! అలాగే ప్రయాణం చేస్తూ లోకమంతా చుట్టిరావడమంటే చాలా ఇష్టమట.

Related News