//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Amala Paul Movies : అమల పాల్ సినిమాలు Hot Actress Amala Pal photos family images videos marriage galleries caste bio data

Category : editorial

అమలా పాల్ కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ చిత్రాలలో నటించింది.ఈమె అసలు పేరు అనఖ . కేరళ లోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబము కేరళ లోని కొచ్చిలో స్థిరపడింది.

తండ్రి వర్గీస్ పాల్, కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తల్లి అన్నీస్ పాల్ గృహిణి. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. విద్యాభ్యాసాన్ని కొచ్చిలో పూర్తిచేసింది.

2009 లో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ లో ప్రవేశానికై ఒక సంవత్సరము విరామము తీసుకొంది. ఈ సమయంలో ఈవిడ చాయాచిత్రాలు చూసిని ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోస్ తన చిత్రం నీల తామర లో ఒక చిన్న పాత్రకు ఈమెను ఎంచుకున్నాడు.

ఆచిత్రం విజయవంతము కానప్పటికి, అందులో ఈవిడ నటన విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తరువాత తమిళ హాస్యచిత్రం వికడకవి లో ఒక పాత్రను పోషించింది. ఈ చిత్ర విడుదల బాగా ఆలస్యంగా జరిగి, ఈవిడ 6 వ చిత్రంగా విడుదలయ్యింది.

ఈమధ్యలో వీర శేకరన్ మరియు సింధు సామవేళి అనే తమిళ చిత్రాలలో నటించింది. సామి దర్శకత్వంలో వచ్చిన సింధు సామవేళిలో ఈమె పోషించిన సుందరి పాత్ర వివాదాలను సృష్టించింది. ఇందులో మావగారితో అక్రమ సంబంధాన్ని కొనసాగీచే కోడలి పాత్రలో నటించింది. తరువాత మైనా చిత్రంలో నటించింది. ఈ చిత్ర ఘనవిజయంతో అవకాశాలు వెల్లువెత్తాయి.

ఈమె తెలుగు లో మొదటగా నాగ చైతన్య తో బెజవాడ సినిమా లో నటించింది.తరువాత పలు తెలుగు సినిమాలలో నటించింది.

Related News