//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సియోల్‌లోని ఆసుపత్రి లోఘోర అగ్ని ప్రమాదం

Category : world

దక్షిణకొరియా రాజధాని సియోల్‌లోని సెజాంగ్‌ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలుకోల్పోగా మరో 80 మందికి గాయాలయ్యాయి ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి ఆసుపత్రిలోని మొదటి రెండవ అంతస్తుల్లో ఉన్న వారే బాధితుల్లో అధికమంది ఉన్నారని అక్కడి అధికారులు చెప్పారు గాయాలపాలయిన వారిని రెస్క్యూ సిబ్బంది మరో ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆ ఆసుపత్రిలో సుమారు 200 మంది ఉన్నారని అక్కడి అధికారులు చెప్పారు అగ్ని ప్రమాదం జరుగుతోందని అరుస్తూ ఓ నర్సు అందరినీ అలెర్ట్ చేయడంతో కొంతమంది అత్యవసర ద్వారాల ద్వారా బయటకు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు నెల రోజుల క్రితం దక్షిణకొరియాలోని ఓ ఫిట్‌నెస్ క్లబ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 29 మంది మృతి చెందిన ఘటన మరవక ముందే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Related News