//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈ నెల 15న భారత మార్కెట్లో 'హానర్ 10 లైట్' విడుదల

Category : technology business

'హానర్' సంస్ధ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ ఈ నెల 15న భారత మార్కెట్లో విడుదల కానుంది. 'హానర్ 10 లైట్' పేరిట ఈ ఫోన్ విడుదల అవ్వబోతుంది. ఈ ఫోన్ గ్రేడియాన్ బ్లూ, వ్యాలే వైట్, మ్యాజిక్ నైట్ బ్లాక్ అనే మూడు రంగులలో ఈ ఫోన్ రానుంది. గత సంవత్సరం చైనాలో 4 జీబీ/6 జీబీ అనే రెండు వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్ ధరలు వరుసగా సుమారు రూ.14,400 (4 జీబీ), రూ.17,500 (6 జీబీ)గా ఉండే అవకాశం ఉంది. ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్లో కిరిన్ 710 ప్రాసెసర్ ని అమర్చారు. ఈ ఫోన్ ఈ నెల 15 నుండి

ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా ఈ ఫోన్ ని అమ్మనున్నారు.

ప్రత్యేకతలు:

6.21" హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (1080 x 2340 పిక్సల్స్)

కిరిన్ 710 ప్రాసెసర్

4 జీబీ/ 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టం

13/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్ ప్రింట్ సెన్సార్

3400 ఎంఏహెచ్ బ్యాటరీ