//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పోలీసులకు లొంగిపోయిన డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్

Category : national

రేపిస్టు బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్ ఇన్సాన్ అలియాస్ ప్రియాంక తనేజా మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయింది. సుమారు నెలరోజులుగా పోలీసులు కళ్లుగప్పి తిరుగుతున్న హనీప్రీత్‌ ఎట్టకేలకు పోలీసుల ముందుకు వచ్చింది. ఆమెను మొదట పంజాబ్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని తర్వాత హర్యానా పోలీసులకు అప్పగించారు. రెండు రేప్ కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌధా మాజీ చీఫ్ గుర్మీత్ బాబాను ఆగస్టు 25న తప్పించేందుకు కుట్ర పన్నారని అలాగే హర్యానా, హింసకు ప్రేరేపించారనే ఆరోపణలతో హనీప్రీత్‌తోపాటు మరికొంత మంది డేరా సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

డేరా బాబాను రోహతక్‌లోని సునారియా జైల్‌కి తరలించిన రెండు రోజులకి హనీప్రీత్ అదృశ్యమైంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆమెపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తనకు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరీ చేయాలని హనీప్రీత్ వేసిన పిటిషన్‌ను కూడా సెప్టెంబర్ 26న ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేథ్యంలో హనీప్రీత్ పోలీసుల ఎదుట లొంగిపోతుందనే ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే ఆమె మంగళవారం లొంగిపోవడంతో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.