//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహిళా మాయలో 25 మంది ఎంపీలు.

Category : national

ఇటీవల రాజస్థాన్‌ ఎంపీని మాయ చేసిన లేడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారించగా దిమ్మదిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.ఈమె వెనుక ఓ పెద్ద గ్యాంగే ఉన్నట్లు వెల్లడైంది. ఈమె జాబితాలో కేసీ పటేల్‌ సహా, ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం హరీశ్‌రావత, ఎంపీ షాదీలాల్‌ బాట్రాతో పాటు దాదాపు 25 మంది ఎంపీలను ఈమె బురిడీ కొట్టించినట్లు వెల్లడైంది.ఆమె ఐఏఎస్‌ చదివి కలెక్టర్‌ కావాలనుకుందంట కానీ కలెక్టర్‌ కలలు నెరవేరలేదు. కనీసం రాజస్థాన్‌ ప్రభుత్వ ఉద్యోగమైనా సంపాదించాలని అనుకుంది, అదీ సాధ్యం కాలేదు. చివరకు ఎంపీలను ‘మాయ’ చేసే వ్యాపారం మొదలు పెట్టి,వారిని బెదిరిస్తూ కోట్ల రూపాయల వసూళ్లు ప్రారంభించింది.

ఈ మహిళ బెడ్‌ రూంలో ఎటువైపునుండైనా స్పష్టంగా రికార్డేయే కెమెరాలు, అంతేకాదు ఆమె దగ్గర నిత్యం స్పై కెమెరాలుంటాయి.ఈ కెమెరాలతో ఎంపిలను బెదిరిస్తూ కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటుంది.లోక్ సభ వెబ్ సైటులో ఎంపీల ఫోన్‌ నంబర్లు సేకరించి,వారికి ఫోన్ చేసి న్యాయ సమస్యలున్నాయని చెబుతుంది. ఇంటికి వస్తే కలిసి మాట్లాడదామని పిలుస్తుంది,ఎంపీ ఇంటికి వెళ్తే వారిని బెడ్‌రూంలోకి తీసుకెళ్తుంది. అక్కడ మత్తుమందిచ్చి ఫొటోలు, వీడియోలు తీసి తర్వాత వాటిని భయటపెడతాని బెదిరిస్తూ సొమ్ము చేసుకుంటుంది ఈ మహిళా.