//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఘరానా మోసగాడు : ఒకే భూమిని 30 మందికి అమ్మిన వ్యక్తి అరెస్ట్!

Category : national

ఢిల్లీలోని జవహర్‌లాల్ యూనివర్సిటీకి చెందిన 30 మంది ప్రొఫెసర్లను తెలివిగా మోసగించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడిని గురుగ్రామ్‌కు చెందిన హితేశ్‌గా పోలీసులు గుర్తించారు. వారి కథనం ప్రకారం.. నైరుతి ఢిల్లీలోని ఖేడా డాబర్ గ్రామంలో తనకు వ్యవసాయం పొలం ఉందని అధ్యాపకులకు చెప్పిన హితేశ్ దానికి ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్మేసుకుంటూ పోయాడు. ఇలా మొత్తం 30 మందిని మోసగించాడు.

ద్వారకలో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఈ వ్యవహారం మొత్తం అక్కడి నుంచే నడిపినట్టు ద్వారక డీసీపీ శిబేష్ సింగ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హితేశ్‌ను అరెస్ట్ చేశారు.

మంచి ధర వచ్చిన ప్రతిసారి హితేశ్ మళ్లీ మళ్లీ ఆ భూమిని విక్రయించేవాడని పోలీసుల విచారణలో తేలింది. 2012లో తొలిసారి ఆ భూమిని దాదాపు రూ.6 కోట్లకు విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. వచ్చిన డబ్బులతో హితేశ్ ఎంజాయ్ చేసేవాడని, విదేశాలకు టూర్లు వెళ్లేవాడని వివరించారు.