Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భూమా- గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ.

Category : state politics

కర్నూలు జిల్లా అహోబిలంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్ వద్ద భూమా- గంగుల వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. సమాచారం అందుకున్న భూమా అఖిలప్రియ అహోబిలం చేరుకున్నారు.

అంతకు ముందే ఆళ్లగడ్డలో కూడా పోలింగ్ బూత్ వద్ద వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. అంతేకాకుండా ఏపీలోని పలు ప్రాంతాలలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా కొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.