హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి తన బ్యాటుకు పనిచెప్పారు. నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ ట్వంటీ లో భారత్ ఘనవిజయాన్ని అందుకున్నది. ఫలితంగా 2-0తో సిరీస్ భారత్ సొంతమైంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. తొలుత వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. తరువాత బౌలింగ్ లో హార్దిక్ పాండ్య తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. నాలుగు వికెట్ల తో చెలరేగాడు ఫలితం గా ఇంగ్లాండ్ ని 198 పరుగులకే నియంత్రించగలిగారు.
తరువాత లక్షఛేదన కి దిగిన భారత్, ఆరు బంతులు మిగిలిఉండగానే తమ లక్షాన్ని ఛేదించింది.రోహిత్ శర్మ, 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ చేయగా, కెప్టెన్ కోహ్లీ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.