//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కనండి.. కంటూనే ఉండండి..!

Category : politics

భారతీయులంతా ఒక్కటే అని కుల, మత బేధాలు చూపకూడదని భారత రాజ్యాంగం నుంచి చదువుకునే పిల్లల సైతం వరకు అందరికి తెలిసిందే. కానీ ఇక్కడ భారత రాజ్యాంగంలో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే విక్రమ్ సైనీకి ఇంకా తెలిసినట్టు లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం పోయి వాళ్ళకి కొత్త సూక్తులు బోధిస్తున్నారు. రాజ్యాంగంలో సభ్యుడిగా ఉంటూ ప్రజలలో బేధాలు చూపిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ.

తాజాగా బీజేపీ ఎమ్మెల్యే 'విక్రం సైనీ ' ముజఫర్‌నగర్ బహిరంగసభలో విస్తుగొలిపే వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు జనాభా నియంత్రణ చట్టం వచ్చేంత వరకు ఆపకుండా పిల్లల్ని కంటూనే ఉండాలని లేకుంటే భవిష్యత్తులో హిందువులు మైనారిటీలోకి వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్న సైనీ తనకు నలుగురైదుగురు పిల్లలు కావాలని తన భార్యకు చెప్పానని తెలిపారు.

హిందువులంతా ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకుంటూ ఉంటే మిగతా మతస్థులు మాత్రం ఇద్దరి కంటె ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని అన్నారు. హిందుస్థాన్ హిందువుల దేశమని అన్నారు. ముస్లింలు అంతా పాకిస్తాన్ వెళ్లిపోవాలని అన్నారు.

ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేం కాదు. హిందూ సంప్రదాయ పండుగలు తప్ప మిగతా మతాల పండుగలు జరుపుకోకూడదని (జనవరి 1 )నూతన సంవత్సర వేడుకలు హిందూ సంప్రదాయ వేడుక కాదని, వాలెంటైన్స్ డే కూడా క్రిస్టియన్ల పండుగని, కాబట్టి హిందువులు అంతా సామూహికంగా ఈ వేడుకలను బహిష్కరించాలని గతంలో పిలుపునిచ్చారు.

Related News