//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలుగు వారిని గౌరవించండి...రాష్ట్రపతి

Category : national

హిందీని మాతృభాష‌గా కలిగిన దేశ ప్రజలు దేశంలోని ఇతర భాషల ప్రజలను అమితంగా గౌరవించాలని పిలుపునిచ్చారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. హిందీని జాతీయ భాషగా కలిగిన నేపథ్యంలో హిందీ ప్రజలు ఇతరులతో గౌరవంగా, సఖ్యతతో మెలిగి సమైక్యభావనను పెంపొందించాలని ఆయన కోరారు. ఢిల్లీలో గురువారం కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరిగిన హిందీ దినోత్సవంలో పాల్గొన్న కోవింద్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బలంగా వ్యక్తం అవుతున్న హిందీ వ్యతిరేకత గురించి ప్రస్తావించారు.

తమిళనాట ఉండే హిందీ వ్యతిరేక ఉద్యమం, బెంగళూరు మెట్రో రైల్వే స్టేషన్లో హిందీ సూచికలు తొలగించాలని స్థానిక కన్నడ సంఘాలు డిమాండ్ చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. హిందీని దశాబ్దాల కిందటే జాతీయ భాషగా ప్రకటించినా ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి నేపథ్యంలో హిందీ మాట్లాడే ప్రజలు ఇతర భాషల వారికి స‌హృద్భావ‌ంతో దగ్గర కావాలన్నారు.అంతేకాదు తెలుగు వారితో మాట్లాడేటప్పుడు వారిని ‘గారు’ అని సంబోధించాలని, తమిళులకు ‘వణక్కం’ చెప్పాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు.