Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హిందూపురం టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా ఆర‌డుగుల బుల్లెట్‌..!

Category : politics

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ఏపీ ప్ర‌జ‌లు త‌మ జీవితాంతం గుర్తు పెట్టుకునే ఎంపీ ఎర్ర‌న్నాయుడు రామ్మోహ‌న్ నాయుడు, గ‌ల్లా జ‌య‌దేవ్‌. అంత‌లా ఏపీ ప్ర‌జ‌లు గుర్తు పెట్టుకునేంత ప‌ని వారు ఏం చేశార‌న్న విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాలా..? అదేనండీ, ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై తాము ప్ర‌ధాని మోడీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకంగా పోరాడ‌లేమంటూ వైసీపీ ఎంపీలో రాజీనామాలు చేసి ఓ మూలన కూర్చుకుంటే.. టీడీపీ ఎంపీలు మాత్రం ప్ర‌జ‌లు త‌మ త‌రుపున పార్ల‌మెంట్‌లో గ‌ళం వినిపించ‌మ‌ని మమ్మ‌ల్ని గెలిపించారు. ప్ర‌జ‌ల కోసం ఎంత‌వ‌ర‌కైనా పోరాడుతాం. ప్ర‌త్యేక హోదా కోసం ఆఖ‌ర‌కు ప్రధాని మోడీతో పోరాడేందుకైనా మేము సై అంటూ టీడీపీ ఎంపీలు కేవ‌లం ఏపీలోనే కాకుండా ఢిల్లీ వేదిక‌గా ధ‌ర్నాలు, పోరాటాలు, ఉద్య‌మాలు చేశారు.

అలా, ఢిల్లీ వేదిక‌గా పోరాడిన టీడీపీ ఎంపీల్లో రామ్మోహ‌న్‌నాయుడు, గ‌ల్లా జ‌య‌దేవ్ చూపిన తెగువ అమోఘం అని, గ‌త పార్ల‌మెంట్ స‌మావేశంలో ప్ర‌త్యేక హోదాపై వీరిద్ద‌రు ఇచ్చిన ప్ర‌సంగాన్ని యాత‌వ్ తెలుగు ప్ర‌పంచం హ్యాట్సాఫ్ చెబితే.. దేశ వ్యాప్తంగా ఉన్న సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు సైతం వీరి ప్ర‌సంగంపై చ‌ర్చించుకున్నారు. వ‌య‌స్సులో చిన్న‌వారైన‌ప్ప‌టికీ దేశ రాజ‌కీయాల‌పై వీరు మాట్లాడిన తీరు బాగుందంటూ వారు కొనియాడారు.

అయితే, ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ప్ర‌ధాని మోడీపై వారు చూపిన తెగువ వెనుక మ‌రో వ్య‌క్తి ఉన్నాడ‌ని, అత‌నే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక రాజ‌కీయ విశ్లేష‌కులు మాట ప్ర‌కారం, యువ‌త శ‌క్తిని అంచ‌నా వేయ‌డంలోను, అలాగే, యువ‌త‌ను ప్రోత్స‌హించ‌డంలోను చంద్ర‌బాబు ముందుంటారు. యువ‌త‌కు నిత్యం స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తూ వారి అభివృద్ధికి తోడ్ప‌డుతుంటారు. ఇలా తెలుగుదేశం పార్టీలో కార్య‌క‌ర్త‌లుగా చేరిన ఎంతో మందిని ఇప్పుడు నేత‌లుగా తీర్చిదిద్దిన ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబుది. అలా రాజ‌కీయ నేత‌గా ఎదిగిన వారు ఎవ‌ర‌న్న‌ది మ‌నంద‌రికి విధిత‌మే.

ఇదిలా ఉండ‌గా, ఎర్రంనాయుడు రామ్మోహ‌న్‌నాయుడు, గ‌ల్లా జ‌య‌దేవ్ త‌ర‌హాలోనే ప‌రిటాల శ్రీ‌రామ్‌ను కూడా పార్ల‌మెంట్‌కు పంపించ‌నున్నార‌నే టాక్ ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న మాట‌. అది కూడా, హిందూపురం పార్ల‌మెంటు స్థానం నుంచి. ఈ విష‌యంలో నిజ‌మెంతో తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే..! మ‌రి చ‌దివాక వ‌చ్చే ఎన్నిక‌ల్లో హిందూపురం నుంచి పార్ల‌మెంట్‌కు ప‌రిటాల శ్రీ‌రామ్ పోటీ చేస్తే గెలుస్తారా..? లేదా..? మీ మ‌న‌సులోని అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియ‌జేయండి..!

కాగా, ప్ర‌స్తుతం హిందూపురం నుంచి పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ఉన్న కిష్ట‌ప్ప 2019 సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావిస్తున్న విష‌యం తెలిసిందే. అనుకున్న‌దే త‌డ‌వుగా సీఎం చంద్ర‌బాబుకు ద‌ర‌ఖాస్తు కూడా పెట్టేసుకున్నారు. అందుకు, సీఎం చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడా..? ఇవ్వ‌డా..? అన్న‌ది మ‌రికొన్ని రోజుల్లో తేల‌నుంది.

ఒక‌వేళ‌, కిష్ట‌ప్ప ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, హిందూపురం నుంచి ఎంపీగా ఎవ‌రిని పోటీ చేయించాలి అన్న ప్రశ్న‌పై సీఎం చంద్ర‌బాబు టీడీపీ నేత‌ల‌తో స‌మాలోచ‌న‌లు చేశారు. వారి చ‌ర్చ‌ల అనంత‌రం మంత్రి ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీ‌రామ్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. అయితే, ప‌రిటాల శ్రీ‌రామ్, ఇప్ప‌టికే సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పొందిన వ్య‌క్తిగా ఉన్నారు. సేవా కార్య‌క్ర‌మాల‌తో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే, హిందూపురం ఎంపీ అభ్య‌ర్థిగా ప‌రిటాల శ్రీ‌రామ్ అయితే బాగుంటుంద‌ని టీడీపీ నేత‌లు సీఎం చంద్ర‌బాబుకు సూచించార‌ట‌. మ‌రి, సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రిటాల శ్రీ‌రామ్‌ను హిందూపురం ఎంపీగా పోటీకి నిల‌బెడ‌తారో..? లేదో..? అన్న విషయంపై మ‌రికొన్ని రోజుల్లో స్ప‌ష్ట‌త రానుంది.

Related News