//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హిమాచల్‌ ఎన్నికలు ఏక పక్షమే

Category : national

హిమాచల్‌ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏక పక్షమేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మరో నాలుగు రోజులలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బిజెపి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మోడి ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారానికి ఆదివారం చివరి రోజు కావడంతో మోడీ పలు ప్రచార సభలలో పాల్గొన్నారు. ఉనలో జరిగిన మూడో సభలో ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు చేసి ఏడాది అవుతున్న సందర్భంగా నవంబరు 8న కాంగ్రెస్‌ పార్టీ 'బ్లాక్‌ డే'గా నిర్వహించడాన్ని తప్పు పట్టారు.పెద్ద నోట్ల రద్దుపై కొంతమంది ఇంకా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారని, నవంబరు 8న బ్లాక్‌డేగా పాటించడానికి సిద్ధమవుతున్నారని కాంగ్రెస్‌పై పరోక్షంగా వ్యాఖ్యానించారు. అన్ని సమస్యలకు పరిష్కారం అభివృద్ధేనన్నారు. అభివృద్ధిపైనే తాము దృష్టి పెట్టామన్నారు.. 68 స్థానాలున్న హిమాచల్‌ అసెంబ్లీకి నవంబరు 9న ఎన్నికలు జరగనున్నాయి.డిసెంబరు 18న ఓట్ల లెక్కింపు జరగనున్నది.