//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రజనీ ప్రజాసంఘంలో హిజ్రాల విభాగం..!

Category : politics

రజనీకాంత్‌ ఈ పేరు ఇప్పుడు సినీరంగంలోనూ, రాజకీయరంగంలోనూ ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజకీయరంగ ప్రవేశాన్ని ధ్రువపరిచిన ఆయన ఆ దిశగా పావులను వేగంగా కదుపుతున్నారు. రజనీ అభిమాన సంఘాన్ని ప్రజా సంఘంగా మార్చారు.

పలువురు అభిమానుల్ని నిర్వాహకులుగా నియమించారు. వారంతా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యుత్వ నమోదు పనిలో నిమగ్నమయ్యారు. కాగా రజనీకాంత్‌ ఏప్రిల్‌లో తన పార్టీ పేరును, గుర్తును వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పుడే పార్టీ విధి విధానాలను వెల్లడించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆదివారం రజనీ చెన్నై, మాంబళంలో ఉన్న జిల్లా ప్రజాసంఘం యువభాగంలో బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు. ఈ వేది కపై పలువురు రైతులకు సహాయకాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ త్వరలో రజనీ ప్రజాసంఘంలో హిజ్రాల విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Related News