//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విజయ్ దేవరకొండ వర్జినా.....19 ఏళ్ల వయసులోనే..

Category : movies

ఈ మధ్య కాలం లో తెలుగు బుల్లితెర పై షోస్ హడావిడి ఎక్కువైపోయింది . ప్రస్తుతం రానా హోస్ట్‌ చేస్తున్న నెం.1 యారి రెండో సీజన్ ప్రారంభం అయింది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ దర్శకుడు నాగ్ అశ్విన్, యూత్ ఐకాన్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ప్రారంబించాడు. ఈ సందర్భంగా ఈ ఇద్దరి నుంచి పలు ఆసక్తికర సమాధానాలు రాబట్టారు రానా. ఇక్కడే మరో ఆసక్తికర విషయం ఏమిటంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో నాగ్ అశ్విన్, రానా 1వ తరగతి నుంచి క్లాస్‌మేట్స్. పదవ తరగతిలో రానా ఫెయిల్ అవ్వడంతో వెనకబడిపోయారట. అప్పటి నుండి ఇద్దరి మధ్య కనెక్షన్ కట్ అయిందని, మళ్లీ లీడర్ సెట్స్‌లో ఇద్దరం కలిశామని రానా గుర్తు చేసుకున్నాడు.

ఫస్ట్ కిస్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలని విజయ్ దేవరకొండను రానా అడగ్గా తాను చిన్నతనం నుండి బాయ్స్ హాస్టల్‍‌లో పెరగడం వల్ల పదో తరగతి వరకు నా జీవితంలో అమ్మాయిలు లేరు. వారంటే భయం కూడా ఉండేది. దాంతో నా ఫస్ట్ కిస్ అనుభవం చాలా లేటుగా జరిగింది. 19 ఏళ్ల వయసులో తొలి ముద్దు రుచి చూశాను అని విజయ్ దేవరకొండ చెప్పాడు . అలాగే పిస్ కొట్టిన భయంకరమైన ప్లేసు ఏంటని రానా ప్రశ్నించగా ఓ సారి మా అంకుల్ పెళ్లిలో నేను మా ఫ్రెండ్స్ తాగేసి మామూలు కారులో వెళ్లాం. అక్కడికి వెళ్లిన తర్వాత ఖరీదైన కార్లన్నీ పార్క్ చేసి ఉన్నాయి. ఈ డబ్బులున్నోళ్ల బలుపు అనే కోపం వచ్చింది. ఆ మత్తులో ఓ ఖరీదైన కారు మీద పిస్ కొట్టాను అని విజయ్ దేవరకొండ గుర్తు నవ్వుతు చెప్పుకొచ్చాడు .

అలాగే అడుగుతూ రానా ఒక్కరిగా విజయ్ దేవరకొండ వర్జినా? కాదా? అని నాగ్ అశ్విన్‌ను అడగ్గా 19 ఏళ్లకే ముద్దు పెట్టాడంటే వర్జిన్ కాదని నా అనుమానం అని వ్యాఖ్యానించారు. దీనికి విజయ్ స్పందిస్తూ అంత తొందరగా నో అని చెబుతావేంటి, 19 ఏళ్లకే నేను ముద్దుతో ఆపేసి ఉండొచ్చు కదా అంటూ కౌంటర్ వేశారు. నేను ఇప్పటికే వర్జిన్ అని స్పష్టం చేశాడు విజయ్.తనకు ఇష్టమైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అని విజయ్ దేవరకొండ సమాధానం ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘అర్జున్ రెడ్డి' సినిమా రూపొందిన విషయం తెలిసిందే.