//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శేఖర్‌రెడ్డి డైరీలో పలువురి ప్రముఖుల 'నిక్ నేమ్స్' పేర్లు?

Category : national

ఆదాయపు పన్ను శాఖ సోదాల్లో పట్టుబడ్డ టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు శేఖర్ ‌రెడ్డి డైరీలో పలువురు ప్రముఖులు పేర్లు కోడ్ లాంగ్వేజ్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గతేడాది డిసెంబరులో శేఖర్‌రెడ్డితోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.132 కోట్ల నగదు, 177 కిలోల బంగారం లభ్యమైన విషయం తెలిసింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శేఖర్ రెడ్డి డైరీలో పలువురు ప్రముఖుల పేర్లు నిక్ నేమ్స్ తో ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

దాడుల సమయంలో ఆయన వద్ద లభించిన డైరీలో హెల్త్‌ మినిస్టర్‌, హైవేస్‌ మినిస్టర్‌, జేడి మైనింగ్‌, టెంపుల్‌, టెంపుల్‌ సన్‌ అంటూ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ సహా, ఓ అయ్యప్ప దేవాలయం సమీపంలోని ఉన్నతాధికారి, మరో మంత్రి, ఇతర అధికారులను సూచించేవేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ ప్రారంభించినట్టు సమాచారం.నోట్ల రద్దు తర్వాత తమ సోదాల్లో దేశంలో పెద్ద మొత్తంలో దొరికిన సొమ్ము ఇదేనని ఆదాయపన్నుశాఖ అప్పట్లో ప్రకటించింది. అక్రమాస్తుల కేసులో అరెస్టు కావడంతో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన్ను తొలగించారు. శేఖర్‌రెడ్డి సహా నలుగురిపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కేసు నమోదు చేశారు.

Related News