//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ .. వేట కొడవళ్ళతో టీడీపీ అభ్యర్థిపై దాడి

Category : politics state

ఏపీలో ఎన్నికల వేళ హత్యా రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి. నిన్నటికి నిన్న వైసీపీ నాయకుడు, వైయస్సార్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. వివేకానంద రెడ్డి హత్య రాష్ట్రం తేరుకోకముందే కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

వేటకొడవళ్లతో టీడీపీ అభ్యర్థి పై దాడి చేశారు కొందరు దుండగులు. కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం రక్తసిక్తమయ్యింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థిపై వేటకొడవళ్లతో దాడి చేశారు. మంత్రాలయం మండలంలో ప్రచారం చేపడుతుండగా.. టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై కొందరు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో.. తిక్కారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఏఎస్సై గోపాల్ కి కూడా తీవ్రగయాలయ్యాయి.

ఈ దాడులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు కూడా జరిపారు. ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని తిక్కా రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన అభ్యర్థి, ఏఎస్ ఐ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.