Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అగ్రి గోల్డ్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం

Category : state business

అగ్రి గోల్డ్ బాధితులకు ఉపశమనం కలిగించే విషయం ఇది. ఆంధ్ర ప్రదేశ్ లో వివాదాస్పదంగా మారిన అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్ట్ ఆస్తుల్లో కీలకమైన హాయ్ లాండ్ ని అమ్మకానికి పెట్టాలని ఎస్‌బిఐని కోర్టు ఆదేశించింది. ఇంటర్నేషన్ లెవెల్లో బిడ్డర్లను పిలవాలని ఆదేశాలు జారీ చేసింది. బాధిత పక్షం వహించింది. కచ్చితంగా బాదితులకు న్యాయం చెయ్యాలని భావిస్తున్న కోర్టు తీసుకున్న నిర్ణయం ఆగ్రి గోల్డ్ బాధితులకు కాస్త ఊరటనిచ్చింది.

ఇవాళ అగ్రిగోల్డ్ కేసు మరోసారి హైకోర్టు ముందుకు వచ్చింది.దీనిపై విచారణ జరిపిన న్యాయస్ధానం హాయ్ లాండ్ కనీస ధర రూ.600 కోట్లుగా ఖరారు చేసింది. ఈ ధరను అనుసరించి హాయ్ లాండ్ ని వేలం వేయాలని ఎస్‌బిఐకి సూచించింది. బిడ్డర్ల వివరాలను ఫిబ్రవరి 8న సీల్డ్ కవర్ లో తమకు సమర్పించాలని ఎస్‌బిఐని ఆదేశించింది. అయితే దాదాపు 2 వేల కోట్లకు పైగానే విలువ వుండే హాయ్ లాండ్ కు 600 కోట్లు మాత్రమే కనీస ధరగా నిర్ణయించటం పై కొంత సందిగ్ధత నెలకొంది.

ఇదే కేసు ఇవాళ మరో పరిణామం చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుపై ఇప్పటివరకు ఆసక్తి కనబర్చిన జీఎస్ఎల్ గ్రూప్ తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆస్తుల కొనుగోలుపై వెనక్కి తగ్గుతూ జీఎస్ఎల్ గ్రూప్ హైకోర్టుకు విన్నవించుకుంది. గతంలో తాము చేసిన ప్రతిపాదన ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం జీఎస్ఎల్ గ్రూప్ కు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.ఇప్పటికే ఈ సంస్థ డిపాజిట్ చేసిన రూ.10కోట్లలో రూ.7 కోట్లు మాత్రమే వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. మిగతా 3 కోట్లను నష్టపరిహారం కింద జమచేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. చూడాలి అగ్రి గోల్డ్ ఆస్తుల విక్రయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకోనున్నాయో.

Related News