//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైఎస్ జ‌గ‌న్‌కు హైకోర్టు భారీ షాక్‌..!

Category : politics

గ‌త నెల‌లో విశాఖ విమానాశ్ర‌యంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై జ‌రిగిన కోడి క‌త్తి ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంఘ‌ట‌న తెలిసిందే. రాజ‌కీయంగా కూడా వేడిని ర‌గిల్చింది. అధికార విప‌క్షాలు ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్ముత్తి పోసుకున్నాయి. దాడి చేసింది జ‌గ‌న్ అభిమానే అని టీడీపీ నేత‌లు ఆరోపిస్తుంటే, వైసీపీ మాత్రం ఇదంతా ప్ర‌భుత్వ కుట్ర‌లో భాగ‌మేన‌ని అంటోంది. దీంతో విచార‌ణ వ్య‌వ‌హారం కోర్టుకు చేరింది.

త‌న‌పై కోడి క‌త్తితో జ‌రిగిన దాడిపై రాష్ట్ర ప్ర‌భుత్వంతో సంబంధం లేని ద‌ర్యాప్తు సంస్థ‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ జ‌గ‌న్ రిట్ పిటీష‌న్‌ను దాఖ‌లు చేశారు. అలాగే, స్వ‌తంత్ర్య సంస్థ‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని వైసీపీ నేత‌లు అనీల్ కుమార్ యాదవ్‌, అమ‌ర్‌నాథ్‌రెడ్డి వేర్వేరుగా ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాలు దాఖ‌ల చేశారు.

ఇవ‌న్నీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రాథాకృష్ణ‌న్ ధ‌ర్మాస‌నం ముందుకు వ‌చ్చాయి. జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగితే దాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ఏపీ డీజీపీ, సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించార‌ని జ‌గ‌న్ త‌రుపు లాయ‌ర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ స‌ర్కార్ అజుమాయిషీ లేని సంస్థ‌తో విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరారు. అయితే, జ‌గ‌న్ స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఏజీ కోర్టుకు విన్న‌వించారు.

స్టేట్‌మెంట్ రికార్డుకు, బ్ల‌డ్ శాంపిల్ ఇచ్చేందుకు ఆయ‌న నిరాక‌రించిన‌ట్టు తెలిపారు. స్వ‌యంగా బాధితుడే రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ప్పుడు ఇంకా ప్ర‌జా ప్ర‌యోజ‌న వాజ్యాలు ఎందుక‌ని కేసు విచార‌ణలో భాగా జ‌గ‌న్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది హైకోర్టు. పోలీసుల ద‌ర్యాప్తు ఎంత వ‌ర‌కు వ‌చ్చిందో తెలుసుకుని వ‌చ్చే మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌డ‌తామ‌ని కోర్టు తెలిపింది. ఇప్ప‌టికే ఆల‌స్యం జ‌రిగినందున వెంట‌నే విచార‌ణ జ‌రిపించాల‌ని జ‌గ‌న్ త‌రుపు న్యాయ‌వాది కోరారు. దీంతో న్యాయ స్థానం ఈ కేసు విచార‌ణ‌ను నేటికి వాయిదా వేసింది.

Related News