//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు ... ఆ కేసులో జగన్ కు ప్రశ్నల వర్షం

Category : politics

ఏపీ రాజకీయం కొత్త పుంతలు తొక్కుతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తి దాడి ఘటన సంచలనం రేపింది. అయితే ఆ ఘటనలో జగన్ భుజానికి స్వల్ప గాయం అయ్యింది. అయితే ఆ గాయాన్ని పెద్దగా చూపే ప్రయత్నం చేసిన జగన్ పార్టీ నాయకులు దాన్ని పెద్ద గొడవగా మార్చి రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చెయ్యాలని చూశారు. ఇక గాయపడిన జగన్ వైజాగ్ నుండి హైదరాబాద్ కు వెళ్లి అక్కడ ట్రీట్ మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏపీ పోలీసులకు కనీసం విచారణకు సహకరించని జగన్ చేసిన స్టేట్మెంట్ పెను దుమారమే లేపింది. ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని కేంద్ర సంస్థల దర్యాప్తు చెయ్యాలని జగన్ , జగన్ పార్టీ నాయకులు చేసిన ప్రకటనతో అటు పోలీసులు, ఇటు రాజకీయ వర్గాలు ఫైర్ అయ్యారు. జగన్ పై దాడి కేసుకు సంబంధించి హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కేంద్ర సంస్థ దర్యాప్తు చెయ్యాలని పిటీషన్ లో కోరారు. High Court gives big shock to jagan Mohan Reddy

ఈ కేసును విచారించిన కోర్టు జగన్ కు అదిరిపోయే షాక్ ఇచ్చింది. తనపై దాడి జరిగిన తర్వాత కనీసం ఏం జరిగిందో కూడా చెప్పకుండా, పోలీసులకు సహకరించకుండా, వారు దర్యాప్తు చెయ్యకుండానే పోలీస్ వ్యవస్థను తప్పు పట్టటం ఆక్షేపణీయం అని కోర్ట్ అభిప్రాయపడింది. మీడియా ముందుకు రాకుండా వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్న వైసీపీ అధినేత జగన్ వేసిన పిటిషన్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే, శుక్రవారం హైకోర్టు దీనిపై విచారణ జరిపింది. అంతేనా.. జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇవ్వకుండా ఘటన జరిగిన వెంటనే విశాఖ నుంచి హైదరాబాద్ ఎందుకు వెళ్లారని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా దర్యాప్తు తీరును ఆక్షేపించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. దీంతో వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీ నాయకులకు కోర్ట్ ఇచ్చిన షాక్ తో ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. వైసీపీ నేతల నోళ్లకు మూతలు పడినట్లు అయింది. High Court gives big shock to jagan Mohan Reddy

కోర్టు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు జగన్ తప్పకుండా ఏపీ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే కనుక జరిగితే వైసీపీ అధినేతకే ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల భావన.High Court gives big shock to jagan Mohan Reddy

Related News