//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రేమికులు మేజర్లయితే కేసులు వద్దన్న హై కోర్ట్

Category : editorial

ప్రేమ వివాహాలకు సంబంధించి యువతీ, యువకుడు మేజర్లని రుజువు ఉంటే  ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్)ను నమోదు చేయవద్దని హైకోర్టు రెండు తెలుగు రాష్ట్రాల డిజిపిలను ఆదేశించింది.  వివాహనం నిర్బంధం, వత్తిడి, పలుకుబడి, మత్తు ప్రయోగం తదితర అంశాల వల్ల జరిగిందని రుజువైతే తప్ప ఎఫ్‌ఐఆర్ నమోదు చేయరాదని హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ ఇచ్చారు. 

తల్లితండ్రులు తమ కుమార్తె మిస్సయినట్లు లేదా కిడ్నాపైనట్లు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, దర్యాప్తులో ఇది మిన్సింగ్ లేదా కిడ్నాప్ కేసు కాదని రుజువైతే కేసు మూసివేయాలని హైకోర్టు ఆదేశించింది. అదే ప్రేమ వివాహం జరిగినట్లు తెలిస్తే, పరస్పరం సమ్మతితో జరిగితే, ఇద్దరు మేజర్లు అయితే కోర్టుకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు ప్రధానంగా శాంతిభద్రతలు పరిరక్షించే విధంగా విధులు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. 

వేరు వేరు కులాలు, మతాలకు చెందిన యువతి, యువకుల మధ్య వివాహం జరిగితే, ఈ విషయం పోలీసుల దృష్టికి వస్తే, ఈ కేసులను జాగ్రత్తగా పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించింది. తల్లితండ్రుల అంగీకారం లేకుండా వివాహం చేసుకున్న మేజర్ల కేసులో అప్రమత్తతతో పోలీసులు వ్యవహరించాలని హైకోర్టు హితవు పలికింది. తమ పిల్లలు మతాంతర, కులాంతర వివాహం చేసుకున్నప్పుడు, నూతన వధూవరులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారని హైకోర్టు పేర్కొంది.  తమ తల్లితండ్రులు ఈ విషయమై పోలీసు స్టేషన్లను ఆశ్రయించినప్పుడు వారు వ్యధ చెందుతారని హైకోర్టు తెలిపింది.

 ‘21వశతాబ్ధంలో మనం ఉన్నాం. కాని తమ పిల్లలు కులాంతర, మతాంతర వివాహం చేసుకుంటే తల్లితండ్రుల మైండ్ సెట్ ఇంకా 18వ శతాబ్ధపు ఆలోచనలతో ఉంటుంది' అని హైకోర్టు పేర్కొంది. చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలకు మతాంతర, కులాంతర వివాహాలు చేస్తామని చెబుతుంటారు. ఈ విషయమై మాట్లాడుతారు, రాస్తారు. నిజంగా ఈ సమస్య తమకు ఎదురైనప్పుడు, అంతకుముందు తాము చేసిన ప్రసంగాలకు కట్టుబడి ఉండరని హైకోర్టు పేర్కొంది. 

పిల్లల తమ అభిప్రాయాలతో ఏకీభవించనప్పుడు, పెద్దలు పిల్లల భవిష్యత్తును వారి నిర్ణయానికి వదిలివేయాలని హైకోర్టు ఈ సందర్భంగా సూచించింది. ఈ దేశంలో యువతకు ఎంతో ముందు చూపుతో ఆలోచించే శక్తి ఉందని, పేర్కొంది. వారిని ఎవరూ నియత్రించలేరని, మతాంతర, కులాంతర వివాహాలు చేసుకోవడం వారి ఇష్టం అని హైకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. 

Related News