//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కడప లో టెన్షన్ టెన్షన్..!

Category : politics

కడప లో కొన్ని రోజులు గా రాజకీయం వేడెక్కుతుంది.సవాళ్లు,ప్రతిసవాళ్ళతో హెట్ పెంచుతున్నారు.పులివెందుల అభివృద్ధి పై కడప ఎంపీ,వైసీపీ నేత అవినాష్ రెడ్డి మరియు టీడీపీ నేత సతీష్ రెడ్డి మధ్య కొన్ని రోజులు గా గొడవలు రాజుకుంటున్నాయి.

ఈ మధ్య జరిగిన ఒక గొడవలో బహిరంగ చర్చకు రావాలని సవాళ్లు చేసారు.ఈ బహిరంగ చర్చ విషయంలో పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది . ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధంగాని పరిస్థితులు వున్నాయి. తరువాత ఆదివారం పూలంగళ్ళ సర్కిల్‌లో బహిరంగ చర్చకు రావాలంటూ ఇరుపార్టీల నేతలు పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో నేడు పూలంగళ్ళ సర్కిల్‌లో జరిగే చర్చకు రావాలని ఇరుపార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.

దీనితో పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై సమాచారమందుకున్న పోలీసులు పెద్దఎత్తున పూలంగళ్ళ సర్కిల్‌కు చేరుకుంటున్నారు. ఇరుపార్టీల నేతలను అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. టీడీపీ, వైసీపీ నేతలు ఎదురుపడితే గొడవలు జరిగే ప్రమాదం ఉండడం తో పోలీస్ బలగాలు పెద్దఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు.

Related News