//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పూరి కోసం హీరోని కలుస్తున్న హీరోయిన్

Category : movies

పూరి జగన్నాద్ గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమవుతున్న సంగతి తెలిసిందే, ఒకానొక సమయంలో వరుస విజయాలతో దూసుకుపోయిన పూరి ఇప్పుడు విజయాలు లేక కష్టాలు పడుతున్నాడు. స్టార్ హీరోలకు హిట్ లు ఇచ్చిన ఆయన ఇప్పుడు హీరో కూడా దొరకక ఇబ్బందులు పడుతున్నాడు, ఇటీవల వచ్చిన మెహబూబా సినిమా కూడా ఆయనకు విజయాన్ని ఇవ్వలేదు.

దీనితో ఇప్పుడు ఆయన సన్నిహితురాలు ఛార్మి రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి, పూరిని కష్టాల నుంచి బయటపడేసే బాధ్యతను ఆమె తీసుకుందట. టాలీవుడ్‌లో తనకు బాగా తెలిసిన ఓ స్టార్‌ హీరోతో చార్మి మంతనాలు జరుపుతోందట. పూరీతో సినిమా చేయడానికిగాను ఆ హీరోగారిని ఒప్పించడానికి చార్మి పడరాని కష్టాలు పడుతోందట. ఆ స్టార్‌ హీరోగారు గతంలో పూరీతో సినిమాలు చేసిన వ్యక్తే. పూరీ సినిమాల ఫలితం తెలిసినప్పటికీ, చార్మి మాట మీద అతనితో సినిమా చేయడానికి ఆ స్టార్‌హీరో అంగీకరించారని అంటున్నారు.