//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీనియర్ హీరోతో జత కట్టనున్న మిల్కీ బ్యూటీ...!

Category : movies

తమన్నా భాటియా ఈ పేరు తెలియని తెలుగు సినీ అభిమాని ఉండరు. కొంత కాలం క్రితం వరకు తమన్నా వరుస ఆఫర్లను అందుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ ప్లేస్ లో వున్నది. కొత్తతరం హీరోయిన్స్ రాకతో ఈమధ్య కాలం లో ఆమె అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.

తమన్నా ఇప్పటివరకు నటించిన అన్ని చిత్రాలలోనూ కుర్ర హీరోలతోనే ఆడిపాడింది. ఇప్పుడు ఆమె మొదటి సరిగా ఒక సీనియర్ హీరో తో జతకట్టనున్నదని సమాచారం. అనిల్ రాఘవ పూడి అనిల్ రావిపూడి దర్శకత్వంలో త్వరలో ఇక మల్టీ స్టారర్ రూపొందుతుంది. అందులో హీరోలుగా వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఈ మూవీ లో వెంకటేష్ కు జోడిగా తమన్నా నటించనున్నది. తొలిసారి తమన్నా తన వయసుకన్నా రెట్టింపు వయసున్న హీరోతో జంటగా నటిస్తోంది.

ఈమె నాగార్జున నటించిన ఊపిరి సినిమాలో నటించినప్పటికీ నాగ్ కు కాకుండా కార్తికి జోడీగా నటించింది.ఇప్పటివరకు శ్రియా, కాజల్ లాంటి హీరోయిన్లు మాత్రమే తమ కన్నా వయసులో చాలా పెద్దవారైన హీరోల పక్కన నటించారు.

కుర్ర హీరోల పక్కన ఇప్పుడు అవకాశాలు రాకపోవడంతో ఇలా సీనియర్ హీరోల సినిమాలు ఒప్పుకున్నదని సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం తమన్నా తెలుగులో కళ్యాణ్ రామ్ పక్కన నా నువ్వే సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సినిమా క్వీన్ రీమేక్ లో చేస్తంది.

Related News