Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎమ్మెల్యే హీరోగా విజయ దేవరకొండ ఫిక్స్ ..

Category : movies

విజయ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా డియర్ కామ్రేడ్స్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుంది. ఈ సినిమా తరువాత 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు'తో దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు క్రాంతిమాధవ్ అయితే కలిసి ఒక సినిమా తిబోతున్నారు. ఈ సినిమా సెట్స్ పై వెళ్ళడానికి విజయ దేవరకొండ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి హీరోయిన్ ని ఖరారు చేసారు.

ఈ సినిమాలో కధానాయిక పాత్ర కోసం చాలామందిని అనుకున్న అందరిని పక్కన పెట్టేసి చివరికి కేథరిన్ ను ఎంచుకున్నారు. కేథరిన్ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తర్వాత ఏ సినిమా చెయ్యలేదు. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మకు గ్లామర్ పరంగా మంచి మార్కులు ఉన్న హిట్ల పరంగా ఇంతవరుకు తాను అనుకున్నంత పెద్ద హిట్లు ఎం తలుపు తట్టలేదు. మరి ఈసారైనా క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండతో నటించడం వాళ్ళ మంచి హిట్ కొడుతుందేమో చూడాలి.

Related News