Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హీరో వెంకీ "చంటి" సినిమా తో ఎంతో పాపులర్ అయిన....ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఆ తరువాత ఏమై పోయాడో తెలుసా....?

Category : movies

మన టాలీవుడ్ లో ఫెస్టివల్ వచ్చింది అంటే చాలు ఆ పండక్కి ముందు గానే రిలీజ్ అయిపోయే సినిమాలు కోకొల్లలు ఉంటాయి.సినిమా బిజినెస్ పెరగాలన్న ...స్టార్ హీరోల మార్కెట్ స్టాండర్డ్ తెలియాలన్న అందరికీ గుర్తుకు వచ్చేది పండగే.అయితే ఈ లెక్కన ఫెస్టివల్ కి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిన సినిమాలు చాలానే ఉన్నాయి.తెలుగులో సంక్రాంతి హీరో అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే పేరు నందమూరి బాలయ్య, విక్టరీ వెంకటేష్ అనే చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఈ సీనియర్ హీరోలకు పోటీగా చాలా సినిమాలే రిలీజ్ అయ్యి సూపర్ డుపర్ హిట్స్ కొడుతున్నాయి.అయితే 1992 సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్ నటించిన " చంటి " సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఓ మలయాళ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా...తెలుగు లోనూ సూపర్ డూపర్ హిట్ కొట్టింది.

ఈ సినిమాతో తెలుగులో విక్టరీ వెంకటేష్ స్టార్ డమ్ తెచ్చుకునీ ఓ క్రేజీ హీరోగా మారిపోయాడు . అలాగే తన నటనలో పలు రకాల హవా భావాలు వ్యక్తీ కరిస్తు ఈ సినిమా ద్వారా ఓ హీరోగా సత్తా చాటాడు. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు నటించిన హీరోయిన్ మీనా, కీలక పాత్రలు పోషించిన నాజర్, మంజుల , సుజాత, బ్రహ్మానందం వంటి వారికి కూడా ఈ సినిమా మంచి పేరును తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం ఆడియెన్స్ చేత జే.జెలు కొట్టించింది.అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించిన ఓ నటుడు మనందరికీ గుర్తుండే ఉంటాడు. ఆ నటుడు ఎవరో కాదు. చిన్నప్పటి వెంకీ పాత్రధారి అజయ్ రాఘవేంద్ర.ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ తనదైన నటనతో ప్రతి ఒక్కరినీ ఎంతో అబ్బురపరిచాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కాలంలో హీరోగా ఎదిగాడు.చంటి సినిమాతో తెరంగ్రేటం చేసిన అజయ్ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే ఆ తర్వాత ఆ స్థాయిలో సినిమాల్లో కనిపించడమే మానేసాడు.

పెరిగి పెద్దవాడైన తరువాత " నా బాపు బొమ్మకి పెళ్ళంటా" అనే సినిమాతో హీరోగా రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సాధారణంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలో అడుగుపెట్టి పెరిగి పెద్దయ్యాక హీరో హీరోయిన్స్ గా ఎదిగిన వాళ్ళు మన పరిశ్రమలో కోకొల్లలు ఉన్నారు.అలాంటి వారిలో ప్రధానంగా. చెప్పుకుంటే శ్రీ దేవి, ఆలీ,మీనా, రాశి, తరుణ్, బాల ఆదిత్య వంటి వారు ఉన్నారు.కానీ అందులో కొంత మంది మాత్రమే సినిమాల్లో సక్సెస్ చూసి మనగలిగారు. చాలా వరకు ఆ స్థాయిలో నటించలేక అవకాశాలు రాక తెర మరుగై పోయారు.అలాంటి వారిలో అజయ్ రాఘవేంద్ర కూడా ఉండడం గమనార్హం.ఎందు కో తాను హీరోగా తన ప్రస్థానం సాధించలేకపోయాడు.

Related News