Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆపరేషన్ 2019 రివ్యూ పై శ్రీకాంత్ ఫైర్

Category : movies

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ 2019 . ఇది ఆపరేషన్ దుర్యోధనకి సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ సినిమా కి కారణం బాబ్జి దర్శకత్వం వహించారు. ప్రస్తుత రాజకీయాల ప్రరిస్థుతల అనుగుణంగా ఈ సినిమాని తెరకెక్కించారు.

సినిమా ఎప్పుడో రావాల్సి ఉంది కానీ తెలంగాణ ఎలక్షన్ నేపథ్యం లో ఈ సినిమాని డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అసలు ఈ సినిమా వచ్చిన విషయం చాలా మందికి తెలీదనుకోండి. అయితే సినిమా కి బాగా నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి.

నిన్న పెట్టిన సక్సెస్ మీట్ లో భాగంగా శ్రీకాంత్ మాట్లాడుతూ సినిమా కి మంచి మౌత్ టాక్ వస్తుంది... అభిమానులు బాగా ఆదరిస్తున్నారు , నిర్మాతలకు డబ్బులు వస్తున్నాయి, డిస్టిబ్యూటర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలం లో నేను చేసిన సినిమాలలో నాకు సంతృప్తిని ఇచ్చిన చిత్రం ఇది. కానీ మీరు బాగాలేదు అని రివ్యూస్ ఇస్తారు. చాలా శాతం ప్రేక్షకులు రేటింగ్స్ చూసి సినిమాలకు వెళతారు.

అలాంటి ప్రేక్షకులు సినిమాకి రివ్యూలా వాళ్ళ సినిమాలకి వెళ్లడం మానేస్తారు. నిర్మాత ఎన్నో డబ్బులు పెట్టి కస్టపడి సినిమాలు తెస్తాడు.... మీ రివ్యూలను నేను గౌరవిస్తాను , ఎవరి అభిప్రాయం వారిది కొంచెం అలోచించి రివ్యూ రాయాలని సలహా ఇచ్చారు. నిర్మాత బాగుంటే పది మందికి పని దొరుకుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Related News