//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏఎన్‌ఆర్‌ బయోపిక్‌ పై ....నాగ్ ఏమన్నారు...?

Category : movies

తెలుగు సినిమాలో అక్కినేని వారసుడిగా తనదైన ముద్ర వేసిన హీరో అక్కినేని నాగార్జున బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించు కోవడానికి వచ్చిన ఆయన...ఉదయం వీఐపీ బ్రేక్‌లో హైదరాబాద్‌ బాడ్మింటన్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ చాముండేశ్వరీనాథ్‌తో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.

తిరుమల అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి లడ్డూప్రసాదాలు ఆయనకు అందజేసారు. అనంతరం నాగార్జున ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్వామిని చూసి కొత్త సంవత్సరం మొదలుపెడదామని ఇక్కడికి వచ్చినట్టు.అందరికి మంచి జరగాలని స్వామిని ప్రార్ధించానన్నారు. త్వరలోనే తన కొత్త సినిమాకు సంబధించిన అన్ని విషయాలను ప్రకటిస్తానన్నారు.

ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు

ఏఎన్‌ఆర్‌ బయోపిక్‌ తియనున్నరా...?అని అడిగిన ప్రశ్నకు నాగ్ మాత్రం నవ్వుతూ సమాధానాన్ని దాటవేశారు..... రీసెంట్ గా రిలీజ్ అయిన NTR బయోపిక్ తరువాత అందరి మనసుల్లో ఆసక్తిగా ఉన్న విషయం ఇదే కావడం... అందుకు నాగ్ కూడా ఆసక్తి గానే ఉన్నట్టు తెలుస్తోంది... చూడాలి మరి ఆ మహానుభావుడి బయోపిక్ నాగ్ ఏపుడు ప్రకటిస్తారు అని.ఆ తరువాత నాగ్ దిగిన సెల్ఫిలో చూస్తే చాలా స్మార్ట్ లుక్ లో అదిరిపోయాడు.పచ్చటి కొండలు బ్యాక్‌గ్రౌండ్‌గా,తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద నాగార్జున సెల్ఫీ తీసుకున్నారు.