//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హెరిటేజీలో విలీనమైన రిలయన్స్‌ డెయిరీ

Category : business state national

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ రిలయన్స్‌ రిటైల్‌కు చెందిన డెయిరీ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేసింది. రిలయన్స్‌ రిటైల్‌ డెయిరీ బిజినెస్‌ కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని హెరిటేజ్‌ సంస్థ గురువారం నాడు బిఎస్‌ఇకి తెలిపింది. కంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఆమోదం లభించిన తర్వాతే ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఆ సంస్థ తెలిపింది. ఏప్రిల్‌ 12నుంచి ఈ ఒప్పందం అమలులోకి రానుందని, రిలయన్స్‌ రిటైల్‌ దుకాణాల్లో యథావిధిగా అమ్మకాలు నిర్వహిస్తామని తెలిపింది. రిలయన్స్‌ రిటైల్‌ డెయిరీ ప్రొడక్ట్‌ విభాగాన్ని కొనుగోలు చేశామని ప్రకటించడంతో గురువారం హెరిటేజ్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది.