//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి

Category : national

జమ్ముకశ్మీర్‌లోని చినాబ్‌ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తుంది. 100కోట్లతో అర్ధ చంద్రాకారంలో 1.315 కిలోమీటర్లు నిర్మించనున్న ఈ బ్రిడ్జ్‌ను రెండేళ్లలో పూర్తి చేయనున్నారు. నది పైభాగం నుండి 359 మీటర్ల ఎత్తులో నిర్మించనున్న ఈ బ్రిడ్జి ఈఫిల్‌ టవర్‌ కంటే 35 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. దీని నిర్మాణం కోసం 24వేల టన్నుల స్టీల్‌ను ఉపయోగించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. కత్రాలోని బక్కాల్‌, శ్రీనగర్‌లోని కౌరీ ప్రాంతాలను కలుపుతూ ఈ వంతెన నిర్మించనున్నారు. అక్కడ వచ్చే బీకర గాలులు, మైనస్ 20 డిగ్రీల వాతావరణాన్ని తట్టుకునేలా ఈ బ్రిడ్జ్‌ను నిర్మిస్తారు. బ్రిడ్జిలో ఉండే సెన్సార్ల సాయంతో గాలి వేగాన్ని గుర్తిస్తారు. 90 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ గాలులు వీస్తే రైల్వే ట్రాక్‌ ఎరుపురంగులోకి మారి సిగ్నల్‌ అందిస్తుంది. అంతేగాక, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బ్రిడ్జిను 63ఎంఎం మందంతో బ్లాస్ట్‌ ప్రూఫ్‌ స్టీల్‌తో నిర్మిస్తారట. ఈ బ్రిడ్జి పూర్తయితే చైనాలోని 275 మీటర్ల షుబ్‌బై రైల్వే వంతెన కంటే ఎత్తైనదిగా గుర్తింపు పొందనున్నది.